రోజుకు 10 లక్షల మందికి వాక్సిన్: మంత్రి ఈటల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ లేదని, ఫస్ట్ వేవ్ కూడా తగ్గుముఖం పట్టిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రోజుకు 10 లక్షల మందికైనా వ్యాక్సిన్ వేసేవిధంగా సిద్ధంగా ఉన్నామని మంత్రి ఈటల అన్నారు. ఎల్బీ స్టేడియంలో తెలంగాణ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ డాక్టర్స్ క్రికెట్ టోర్నీమెంట్ 2020-2021ను మంత్రి ఈటల ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల కరోనా సెకండ్ వేవ్‌పై స్పందించారు. తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ లేదని, సోషల్ మీడియాలలో అనవసర ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఫస్ట్ వేవ్ కూడా తగ్గుముఖం పట్టిందని పేర్కొన్నారు. బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో పాజిటివ్ వచ్చిన వారి సాంపిల్స్ సీసీఎంబి కి పంపించామన్నారు. అందులో ఒక్కరికి ఉన్నట్లు నిర్ధారణ జరిగిందని తెలిపారు. టెంపరేచర్ పెరిగితే కరోనా ఫస్ట్ ఫేస్ అంతం అవుతుందని యోచిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కరోనా రహిత రాష్ట్రం ఉండాలని కోరుకుంటున్న అన్నారు. అలాగే వ్యాక్సిన్ వచ్చిన వెంటనే 10 వేల మంది సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు. రోజుకు 10 లక్షల మందికైనా వ్యాక్సిన్ వేసేవిధంగా సిద్ధంగా ఉన్నామని ఈటల పేర్కొన్నారు.
రేపు రెండు జిల్లాల్లో డ్రైరన్..
రాష్ట్రంలో రేపు జరుగనున్న కొవిడ్ వ్యాక్సిన్ డ్రైరన్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో డ్రైరన్ చేపట్టనున్నారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి, నాంపల్లి ఏరియా ఆస్పత్రి, తిలక్ నగర్ యూపిహెచ్సి, సోమాజిగూడలోని యశోద ఆస్పత్రి, మహబూబ్‌నగర్ జిల్లాలో ని ప్రభుత్వ పిహెచ్సి, ఓ ప్రైవేటు ఆస్పత్రిలో డ్రై రన్ నిర్వహించనున్నారు.