ర‌జినీ సిఎం అభ్య‌ర్థి అయితేనే ఓకే: లారెన్స్

చెన్నై: ప్ర‌ముఖ న‌టుడు, ద‌ర్శ‌కుడు, నృత్య‌ద‌ర్శ‌కుడు రాఘ‌వ లారెన్స్ ఇటీవ‌ల రాజ‌కీయాల్లోకి రాబోతున్నాన‌ని చేసిన ప్ర‌క‌ట‌న తెలిసిందే.. కాగా అదీ త‌న గురువు త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ పార్టీలో చేర‌నున్నాడ‌ని తెలిపారు. ఈ ప్ర‌క‌ట‌న త‌మిళ రాజ‌కీయ‌, సీనీ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది.. అయితే రజినీ పార్టీలో చేరడానికి లారెన్స్ ఓ షరతు విధించాడు. సూప‌ర్ స్టార్ రజినీకాంత్ సీఎం అభ్యర్థి అయితేనే తాను పార్టీలో చేరతానని, వేరే వ్యక్తి అయితే అందుకు తాను అంగీకరించబోనని లారెన్స్ స్పష్టం చేయడం ఆసక్తికరంగా మారింది. పార్టీలో అనుభవం వున్న వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తానని, తను ముఖ్యమంత్రి అభ్యర్థిని కానని గతంలో రజనీ చెప్పిన విషయం తెలిసిందే. అయితే తన నిర్ణయాన్ని రజినీ వెనక్కి తీసుకోవాలని కోరుతూ లారెన్స్ తాజాగా ఓ ట్వీట్ చేశాడు.

 

 

Leave A Reply

Your email address will not be published.