`ల‌క్ష్యా`నికి చేరువ‌లో నాగశౌర్య..

హైదరాబాద్‌: యంగ్‌హీరో నాగశౌర్య త‌న 20వ చిత్రంలో షాకింగ్‌ లుక్‌లో ఫ్యాన్స్‌ను అల‌రించ‌బోతున్నాడు. ఈ చిత్రానికి `ల‌క్ష్య` అనే టైటిల్‌ను అధికారికంగా ఖరారు చేస్తూ చిత్ర యూనిట్‌ ఒక స్పెషల్‌ పోస్టర్‌ను సోమవారం విడుదల చేసింది. కేతికాశ‌ర్మ క‌థాయాయిక‌. కండలు తిరిగిన‌ శరీర సౌష్టవంతో, డిఫరెంట్‌గా నాగ‌శౌర్య లుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. టాలీవుడ్‌లో వినూత్న ప్రయోగాలతో ప్రేక్షకులముందుకు వస్తున్న నాగశౌర్య తాజా లుక్‌పై అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఊహలు గుసాగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హీరో నాగశౌర్య లీడ్‌ రోల్‌ పోషిస్తున్న ఈ సినిమా విలువిద్య నేపథ్యంలో తెరకెక్కుతున్న తొలి భారతీయ మూవీ అని చిత్ర యూనిట్‌ చెబుతోంది. ఈ చిత్రంలో ఆర్చర్ పాత్రలో కనిపిస్తున్నాడు నాగశౌర్య. సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో యంగ్‌ హీరో నాగశౌర్యకు జోడిగా కేతికా శర్మ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.