ల‌క్ష ఇండ్లు త్వ‌ర‌లోనే పూర్తి..

హైద‌రాబాద్:గ‌్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో నిర్మిస్తున్న ల‌క్ష డ‌బుల్ బెడ్ ఇండ్లు త్వ‌రలోనే పూర్త‌వుతాయ‌ని పుర‌పాల‌క మంత్రి కెటిఆర్ తెలిపారు. డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణపై మంత్రులు కేటీఆర్, వేముల ప్ర‌శాంత్ రెడ్డి గురువారం హైద‌రాబాద్‌లో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మీక్షా స‌మావేశానికి జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్, పుర‌పాల‌క‌, గృహ నిర్మాణ శాఖ అధికారులు హాజ‌ర‌య్యారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో ల‌క్ష ఇండ్లు త్వ‌ర‌లోనే పూర్త‌వుతాయ‌న్నారు అధికారులు. ల‌బ్దిదారుల ఎంపిక ప్ర‌క్రియ చేప‌ట్టాల‌ని అధికారుల‌ను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. క‌లెక్ట‌ర్ల‌తో క‌లిసి ఎంపిక చేయాల‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌నర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ల‌బ్ధిదారుల ఎంపిక‌లో పార‌ద‌ర్శ‌క‌త పాటించాల‌న్నారు. గ‌తంలో ఇళ్లు పొందిన వారు మ‌రోసారి ఇళ్లు రాకుండా చూడాల‌న్నారు. వాస్త‌వ ల‌బ్దిదారులను ఎంపిక చేయాల‌ని తెలిపారు. డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తున్న చోట ప‌చ్చ‌ద‌నానికి ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని అధికారుల‌ను కేటీఆర్ ఆదేశించారు.

 

 

ల‌క్ష ఇండ్లు చూపించి తీరుతాం : మ‌ంత్రి త‌ల‌సాని
ల‌క్ష డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తున్నామ‌న్న ప్ర‌తిపాద‌న‌కు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని రాష్ర్ట మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ స్ప‌ష్టం చేశారు. భ‌ట్టి విక్ర‌మార్క వెంబ‌డి తిరిగి ల‌క్ష ఇండ్లు చూపిస్తాన‌ని మంత్రి తేల్చిచెప్పారు. న‌గ‌రంలోని జియ‌గూడ‌, గోడికేక‌బీర్, ఇందిరాగాంధీ కాల‌నీ, బ‌న్సీలాల్‌పేట, క‌ట్టెల‌మండిలో నిర్మించిన డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల‌ను భ‌ట్టి విక్ర‌మార్క‌కు మంత్రి త‌ల‌సాని, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ క‌లిసి చూపించారు. అనంత‌రం మంత్రి త‌ల‌సాని మీడియాతో మాట్లాడారు. పేద వ‌ర్గాలు గొప్ప‌గా బ‌త‌కాల‌నే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఈ ప‌థ‌కాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నార‌ని తెలిపారు. డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల‌ను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వ‌ర్గాల‌కే కేటాయిస్తున్నామ‌ని చెప్పారు. ఈ ఇండ్ల‌ను సీఎం కేసీఆరే డిజైన్ చేశార‌ని గుర్తు చేశారు. హైద‌రాబాద్‌లో మొత్తం 60 ప్రాంతాల్లో ఇండ్లు నిర్మిస్తున్నామ‌ని తెలిపారు. ఇవాళ చూసింది చాలా త‌క్కువ అని తెలిపారు. భార‌త‌దేశ చ‌రిత్ర‌లో ఎన్నడూ లేని విధంగా రాష్ర్ట ప్ర‌భుత్వం డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తున్నామ‌ని చెప్పారు.

 

 

Leave A Reply

Your email address will not be published.