`వకీల్ సాబ్` నుండి రేపు మరో పాట
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న `వకీల్ సాబ్` నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాలోని `సత్యమేవ జయతే` అనే పాటని 3న (రేపు సాయంత్రం 5 గంటలకు) విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేవ్వర క్రియేషన్స్ ప్రకటించింది. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా, తమన్ స్వరరచన చేశారు. బోనీకపూర్ సమర్పణలో దిల్ రాజు – శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించాడు. శ్రుతీహాసన్ తో పాటు నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 9న రాబోతోంది. అమితాబ్ నటించిన ‘పింక్’కు రీమేక్ అయిన ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. తన కెరీర్‌లో తొలిసారి లాయర్ పాత్రపోషిస్తున్నారు పవన్ కల్యాన్. దానికి తోడు కొన్నళ్ల విరామం తర్వాత పవన్ రీ ఎంట్రీ ఇస్తుండటంతో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.