వరదనీటిలో కొట్టుకోపోయిన‌ హీరో శర్వానంద్‌ తాతయ్య ఇల్లు

అమ‌రావ‌తి: సినీ నటుడు శర్వానంద్‌కు చేందిన‌ ఇల్లు అవ‌నిగ‌డ్డ ప‌రిస‌రాల్లోని కృష్ణానది వరద నీటిలో కొట్టుకుపోయింది. ఈ ఇల్లు భారత మాజీ అణు శాస్త్రవేత్త డాక్టర్‌ మైనేని హరిప్రసాద్‌కు చెందినది.. అన్న‌ట్టు సినీ నటుడు శర్వానంద్‌కు హరిప్రసాద్‌ తాతయ్య కావడంతో గతంలో గ్రామానికి వచ్చినప్పుడు శర్వానంద్‌ ఇదే భవనంలో గడిపేవారు. భార‌త అణు శాస్త్రవేత్తగా, సంఘ సేవకుడిగా మైనేని హరిప్రసాద్ కి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది.. అలాగే సినీ హీరోగా యువ‌కుల్లో శర్వానంద్ ఉన్న క్రేజ్ ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. వీరిరువురు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు కలిగిన వారు కావడంతో వారికి చెందిన భవనం వరదల్లో కొట్టుకుపోతుండటంతో స్థానికులు పెద్ద సంఖ్యలో ఆ ఇంటి పరిసరాల్లో నిలబడి ఒకింత ఆవేదనకు గురయ్యారు.

Leave A Reply

Your email address will not be published.