వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్

న్యూఢిల్లీ: హమ్మయ్య! వాట్సాప్ గ్రూపు చాట్స్, అలర్ట్స్ తో విసిగిపోయిన యూజర్లుకు ఊరటనిచ్చే వార్త. ప్రతి రోజు ఒక్కో గ్రూప్‌లో వందల మెస్సేజ్‌లో అలర్ట్‌లతో విసిగిపోయిన యూజర్లకు నిజంగా ఇది శుభవార్తే.. మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఈ కీలక ఫీచర్‌ను తీసుకొచ్చింది. వాట్సాప్‌లోని గ్రూప్ చాట్లను ఆల్వేస్ మ్యూట్ అనే ఆప్షన్ తోఎప్పటికీ మ్యూట్ చేసే ఫీచర్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది.
ఈ విషయాన్ని వాట్సాప్ తన అధికారిక ట్విటర్ లో వెల్లడించింది. చాట్‌ను ఎప్పటికీ మ్యూట్ చేయవచ్చని ట్వీట్ చేసింది. దీంతో యూజర్లకు తలనొప్పల నుండి విముక్తి కలిగించింది. ఈ క్రొత్త ఫీచర్ ప్రజలు ఆ ఇబ్బందికరమైన వాట్సాప్ గ్రూపులనుంచి ఎప్పటికీ ఇబ్బంది లేకుండా ఉండటానికి ఇదిసహాయపడుతుంది. చాట్‌ను మ్యూట్ చేస్తే సంబంధిత గ్రూపులనుంచి నోటిఫికేషన్ రాదు. సందేశాలు, చిత్రాలు లేదా వీడియోలు, ఇతర ఏ ఫీడ్ ఇబ్బంది పెట్టదు. అంతేకాదు. అవసరమైతే దీన్ని అన్‌మ్యూటింగ్ అవకాశం కూడా ఉంది. ఇప్పటివరకు ఈ సదుపాయం ఎనిమిది గంటలు, ఒక వారం, ఒక సంవత్సరం పాటు మ్యూట్ చేయడానికి అనుమతి ఉన్న సంగతి తెలిసిందే. ఏది ఏమైనా వాట్సప్ యూజర్లకు నిజంగా ఇది శుభవార్తే.
You can now mute a chat forever 🤫 pic.twitter.com/DlH7jAt6P8
— WhatsApp Inc. (@WhatsApp) October 23, 2020