వాట్సాప్ లో వచ్చిన కొత్త ఫీచర్స్..

హైద‌రాబాద్: ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తీసుకొస్తూ వినియోగ‌దారులను ఆక‌ర్షిస్తుంది వాట్సాప్ మెసేజింగ్ యాప్‌.. ఈ వారంలో వచ్చిన వాట్సాప్‌లో తీసుకురాబోయే కొత్త ఫీచర్లతో పాటు, ఇతర సమాచారం గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం వాట్సాప్ యూజర్లు కేవలం మొబైల్ యాప్ ద్వారా మాత్రమే వాయిస్, వీడియో కాల్స్ చేసుకొనే సదుపాయం ఉంది. ఇప్పుడు ఈ ఫీచర్ ని వాట్సాప్ వెబ్ వెర్షన్ లకు కూడా తీసుకురానున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. ఇప్పటికే ఈ సదుపాయం బీటా యూజర్లకు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. త్వరలో మిగతా వినియోగదారులకు కూడా తీసుకురానున్నట్లు పేర్కొంది. వాట్సాప్ గత నెలలో భారతదేశంలో వాట్సాప్ పే సేవలను ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ వారంలో జరిగిన ఫేస్‌బుక్ యొక్క ఫ్యూయల్ ఫర్ ఇండియా 2020 సమావేశంలో వాట్సాప్ యూజర్లు ఇప్పుడు ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ లేదా యాక్సిస్ బ్యాంక్ ఖాతాల ద్వారా కూడా వాట్సాప్ పే సేవలను ఉపయోగించి చెల్లింపులు చేయవచ్చని ప్రకటించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌లో 50 మిలియన్లకు పైగా వినియోగదారులు భాగస్వామ్యం అయ్యారని మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. వీరిలో దాదాపు 15 మిలియన్ల మంది వినియోగదారులు భారతదేశం నుండే ఉన్నారని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.