విద్యాసంస్థ‌ల ప్రారంభానికి 25 లోపు సిద్ధం కావాలి..

విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్‌: విద్యార్థుల భ‌విష్య‌త్‌ను దృష్టిలో ఉంచుకుని విద్యాసంస్థలు ప్రారంభించేందుకు ఈనెల 25లోపు సిద్ధం కావాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. విద్యాసంస్థలు, గురుకులాలు, వసతి గృహాలు తెరవడంపై మంత్రులు సబితా, సత్యవతి రాథోడ్‌, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ సమీక్ష నిర్వహించారు. కాగా ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.

ఈ సంద‌ర్భంగా మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ..ఫిబ్రవరి 1 నుంచి 9వ తరగతి నుంచి ఆపై కోర్సులకు తరగతులు ప్రారంభించాల‌న్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను కూడా దృష్టిలో ఉంచుకొని పుస్తకాలు, యూనిఫారాలు ఇప్పటికే చేరవేశామ‌న్నారు. రేపటి సమావేశానికి తల్లిదండ్రుల కమిటీని ఆహ్వానించాంమ‌ని తెలిపారు. విద్యార్థుల హాజరు విషయంలో ఎలాంటి ఒత్తిడి ఉండదని స్ప‌ష్టం చేశారు. హాస్టళ్లలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.