విమానంలో మంటలు.. వీడియో వైర‌ల్‌

వాషింగ్టన్‌: టేకాఫ్‌ అయిన కొద్ది నిమిషాల్లోనే యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ఇంజిన్‌లో భారీగా మంట‌లు చెల‌రేగాయి. ఇప్పుడు ఇంట‌ర్‌నెట్‌లో ఈ వీడియో వైర‌ల్ అవుతోంది. పైల‌ట్లు ప్ర‌మాదాన్ని గుర్తించి వెంట‌నే ల్యాండింగ్ చేయ‌డంతో భారీ ప్ర‌మాదం త‌ప్పింది. శనివారం డెన్వర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బోయింగ్‌ 777-200 విమానం 231 మంది ప్రయాణికులు, పది మంది సిబ్బందితో హోనొలులు బయలుదేరింది. టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే ఇంజిన్‌లో మంట‌లు చెల‌రేగిన‌ట్లు ఫెడరల్‌ ఏవియేషన్ అధికారులు ఆదివారం తెలిపారు. కాగా ఈ ప్ర‌మాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదని చెప్పింది.

అయితే, విమాన శకలాలు ఓ ఇంటి బయట చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ చిత్రాలను కొలరాడోలోని బ్రూమ్‌ఫీల్డ్‌ పోలీసులు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అలాగే విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలకు సంబంధించిన వీడియో సైతం సోషల్‌ మీడియాలో కనిపించింది.
ఇప్పుడు ఈ వీడియో, ఫోటోలు ఇంట‌ర్నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

 

 

Leave A Reply

Your email address will not be published.