`వీర‌మ‌ల్లు` క‌స‌ర‌త్తులు.. ఫొటోలు వైర‌ల్‌..

క్రిష్ డైరెక్ష‌న్ లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ క‌థానాయ‌కుడిగా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ ప్రాజెక్టులో ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌రికొత్త అవ‌తారంలో క‌నిపిస్తూ సంద‌డి చేయ‌బోతున్నాడు. ఇటీవ‌లే విడుద‌లైన టీజ‌ర్‌లో ప‌వ‌న్ శూలం ప‌ట్టుకుని జంప్ చేస్తున్న లుక్ అభిమానుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. అయితే తాజాగా సినిమా కోసం ప‌వ‌న్‌క‌ల్యాణ్ సీరియ‌స్‌గా శూలంతో క‌స‌ర‌త్తులు చేస్తున్న స్టిల్స్ నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. బ్లాక్ జిమ్ వేర్‌లో ఉన్న ప‌వ‌న్ ట్రైన‌ర్ తో క‌లిసి విన్యాసాలు నేర్చుకుంటున్నాడు.

Leave A Reply

Your email address will not be published.