‘వైఎస్సార్ ఆసరా’ ఆరంభం!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త పథకం ప్రారంభమైంది. ముందుగా ప్రభుత్వం ప్రకటించినట్లుగానే ‘వైఎస్సార్ ఆసరా’ నేడు ఆరంభమైంది. ఈ పథకాన్ని ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సిఎం తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రారంభించారు. 8,71,302 పొదుపు సంఘాల్లో 87,74,674 మంది మహిళల పేరుతో బ్యాంకుల్లో ఉన్న అప్పు రూ.27,168.83 కోట్లను ప్రభుత్వం నాలుగు విడతల్లో నేరుగా ఆయా సంఘాల పొదుపు ఖాతాల్లో జమ చేయనుంది. తొలి విడతలో రూ.6,792.20 కోట్లను ఆయా కార్పొరేషన్ల ద్వారా నేడు జమ చేశారు. ఈ మొత్తాన్ని ఎలా ఖర్చు చేసుకోవాలన్న నిర్ణయాన్ని మహిళలకే వదిలేస్తున్నామని, బ్యాంకర్లు ఆ మొత్తాన్ని పాత అప్పులకు మినహాయించుకోకూడదని సర్కార్ స్పష్టం చేసింది.