వ్యవసాయ బిల్లును వ్యతిరేకించిన టీఆర్‌ఎస్‌

ఢిల్లీ: కేంద్రం ప్ర‌వేశ‌పెట్టే ఈ వ్య‌వ‌సాయ బిల్లు వ్యవసాయ రంగంలోనూ కార్పొరేట్లను పెంచి పోషించేలా ఉంద‌ని టిఆర్ ఎస్ పార్టీ ఆరోపించింది. రాజ్య‌స‌భ‌లో నూత్య‌న వ్య‌వ‌సాయ బిల్లుకు టిఆర్‌పార్టీ వ్య‌తిరేకించింది. ఈ సందర్భంగా టిఆర్ఎస్‌ పార్టీ పార్లమెంటరీ పక్షనేత, ఎంపీ కేశవరావు మాట్లాడారు. కొత్త వ్యవసాయ బిల్లుతో రైతులను తీరని నష్టం జరిగే అవకాశముందని అన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా కేంద్రం బిల్లును రూపొందించిందని ఆక్షేపించారు. రైతులకు అండగా లేని ఇలాంటి చట్టాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. మార్కెటింగ్‌ ఏజెంట్లకు సైతం నష్టం కలిగించేలా ఈ కొత్త చట్టం ఉందని పేర్కొన్నారు. కేంద్రం ఏ పథకానికి సక్రమంగా నిధులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని గుర్తుచేశారు.
శనివారం టీఆర్‌ఎస్‌ ఎంపీలతో కలిసి పార్లమెంట్‌ ఆవరణలో కే కేశవరావు, పార్టీ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు మీడియాతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా ఆర్డినెన్స్‌లతో పాలన చేస్తోంద‌ని కేశవరావు ఆరోపించారు. ఆదివారం ఇప్పటివరకు మార్కెట్లు, వ్యవసాయ సంబంధిత అంశాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండేవని, కేంద్రం తీసుకొచ్చే బిల్లులతో అన్నీ కేంద్రం చేతికి వెళ్లిపోయి రాష్ర్టాల పాత్ర తగ్గుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ.. దేశంలోని రైతులను బిచ్చగాళ్లు, కూలీలను చేద్దామనుకుంటున్నారా? అని కేంద్రాన్ని నిలదీశారు. లోక్‌సభలో మెజార్టీ ఉన్నది కదా అని బిల్లులను పాస్‌ చేయించుకున్నారని, కానీ రాజ్యసభలో టీఆర్‌ఎస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.