వ్యాక్సిన్ వేయించుకున్న నాగార్జున

హైదరాబాద్‌: టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున క‌రోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో టీకా మొదటి డోసు వేయించుకున్నారు. ఈ విషయాన్ని నాగార్జున ట్విటర్‌ ద్వారా తెలియజేశారు.

‘నేను కొవిడ్ టీకా మొదటి డోస్‌ తీసుకున్నాను. అర్హులైన అంద‌రూ వ్యాక్సిన్‌ను తీసుకోవాలి. దీనికోసం ఆన్‌లైన్‌లో (cowin.gov.in) రిజిస్టర్‌ చేసుకుని, టీకా వేయించుకోవాలి’ అని నాగార్జున ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.