వ్యాపార‌వేత్త‌తో ఘ‌నంగా బాపు బొమ్మ ప్రణీత వివాహం

హైదరాబాద్‌ (CLiC2NEWS): అందాల ముద్దుగుమ్మ ప్రణీత సుభాష్‌ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్‌ రాజును హీరోయిన్ ప్ర‌ణీత మనువాడారు. కరోనా నిబంధనలను పాటిస్తూ అత్యంత తక్కువ మంది బంధు మిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. తాజాగా ప్రణీత-నితిన్‌ల వివాహ వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

‘ఏం పిల్లో ఏం పిల్లడో’తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగిడిన ఈ కన్నడ కస్తూరి అనతికాలంలో పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌ వంటి బడా హీరోల ప్రక్కన నటించారు. పవన్‌ కళ్యాణ్‌తో అత్తారింటికి దారేది, మహేష్‌తో బ్రహ్మోత్సవం, ఎన్టీఆర్‌తో రభస, రామ్‌తో హలో గురు ప్రేమ కోసమే తో పాటు బావ, పాండవులు పాండవులు తుమ్మెద వంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో హంగామా-2లో నటిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.