వ్య‌వ‌సాయేత‌ర రిజిస్ట్రేష్ల‌కు హైకోర్టు అనుమ‌తి

హైద‌రాబాద్‌: తెలంగాణ‌లో వ్య‌వ‌సాయేత‌ర రిజిస్ట్రేష‌న్ల‌కు హైకోర్టు అనుమ‌తి ల‌భించింది. కంప్యూట‌ర్ ఆధారిత ప‌ద్ధ‌తిలో రిజిస్ట్రేష‌న్లు చేప‌ట్టాల‌ని ఉన్న‌త న్యాయ‌స్థానం ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. ప్ర‌భుత్వ విన‌తి వేర‌కు వ్య‌వ‌సాయేత‌ర ఆస్తుల రిజిస్ట్రేష‌న్ల‌పై ఇవాళ (గురువారం) విచార‌ణ జ‌రిపిన ఉన్న‌త న్యాయ‌స్థానం ప‌లు సూచ‌న‌లు చేస్తూ అనుమ‌తిచ్చింది. రిజిస్ట్రేష‌న్ కోసం ముందుగా స్టాట్ బుకింగ్ చేసుకొనే విధానానికి అనుమ‌తిచ్చింది. ఆస్తిప‌న్ను గుర్తింపు సంఖ్య క‌చ్చితంగా ఉండాలన్న నిబంధ‌న‌కు న్యాయ‌స్థానం స‌మ్మ‌తించింది. రిజిస్ట్రేష‌న్ల స‌మ‌యంలో ఆధార్‌, కులం, కుటుంబ‌స‌భ్యుల వివ‌రాలు అడ‌గ‌బోమ‌ని ప్ర‌భుత్వం హైకోర్టుకు స్ప‌ష్టం చేసింది. రిజిస్ట్రేష‌న్లు ఆపాల‌ని ఎప్పుడూ స్టే ఇవ్వ‌లేద‌ని విచార‌ణ సంద‌ర్భంగా మ‌రోసారి న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది. అలాగే ధ‌ర‌ణిపై ఇవాళ మ‌రో ఐదు అనుంబంధ పిటిష‌న్లు దాఖ‌ల‌య్యాయి. వాటిపై కౌంట‌ర్ దాఖ‌లు చేసేందుకు ప్ర‌భుత్వం త‌ర‌ఫున అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ బిఎస్‌ప్ర‌సాద్ హైకోర్టును గ‌డువు కోరారు. ఈ మేర‌కు విచార‌ణ‌ను ఈ నెల 16కు ఉన్నాత న్యాయ‌స్థానం వాయిదా వేసింది.

Leave A Reply

Your email address will not be published.