వకీల్ సాబ్: థియేటర్స్ దగ్గర పడిగాపులు కాస్తున్న ఫ్యాన్స్
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మూడేళ్ల నుండి ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఇప్పటికే మార్నింగ్ బెనిఫిట్ షోతో వకీల్ చిత్రం ప్రదర్శితం కాగా, ఈ సినిమా రెండు వేలకు పైగా థియేటర్స్లో విడుదలవుతుంది. ఇప్పటికే 3 రోజుల వరకు అడ్వాన్స్ బుక్కింగ్స్ పూర్తి కావడంతో ఫ్యాన్స్ థియేటర్స్ దగ్గర టిక్కెట్స్ కోసం నానా తంటాలు పడుతున్నారు.
అభిమాన నటుడి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఫ్యాన్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ థియేటర్స్ దగ్గర పడిగాపులు కాస్తున్నారు. కరోనాని సైతం లెక్క చేయకుండా నానా హంగామా చేస్తున్నారు. థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపిస్తుంది.