వనస్థలిపురంలో డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభం

హైదరాబాద్ : వనస్థలిపురం పరిధిలోని జైభవాని నగర్‌లోని రైతుబజార్ వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రెండు ఎకరాల విస్తీర్ణంలో 3 బ్లాక్‌లుగా 9 అంతస్తుల్లో 324 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. ఈ ఇండ్లను రూ.28కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇండ్ల ప్రారంభంతో లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ మల్లేశం, మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.