శంషాబాద్‌లో కారు, లారీ ఢీ.. 6గురు మృతి, 15 మందికి గాయాలు

రంగారెడ్డి : హైద‌రాబాద్ శివారులోని శంషాబాద్‌లో ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో అక్క‌డిక‌క్క‌డే ఆరుగురు మృతిచెందారు. మ‌రో ఆరుగురు లారీ కింద చిక్కుకున్నారు.. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. శంషాబాద్‌లో కారును లారీ ఢీకొన్న సంఘటనలో ఆరుగురు ఇటుకబట్టీ కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. లారీ కింద ఆరుగురు కూరగాయల వ్యాపారులు చిక్కుకున్నారు. ప్రమాద సమయంలో 50 పైగా కార్మికులు ఉన్నారు.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స‌మీప దవాఖానకు త‌ర‌లించారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. లారీ శంషాబాద్ నుంచి షాద్‌న‌గ‌ర్‌కు వెళ్తుండ‌గా న‌ర్కుడ గ్రామం వ‌ద్ద ప్రమాదానికి గురై బోల్తా ప‌డింది. వారాంత‌పు సంత‌కు వెళ్లి వ‌స్తుండ‌గా ప్రమాదం చోటుచేసుకుంది. వీరంతా ఒడిశాలోని బ‌లంగిర్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. రోడ్డ‌కు అడ్డంగా లారీ బోల్తా ప‌డ‌టంతో చాలాసేపు ట్రాఫిక్‌కు అంత‌రాయం క‌లిగింది. జెసిబితో లారీని ప‌క్క‌కు తొల‌గించి ట్రాఫిక్‌ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రించారు. కాగా క్ష‌త‌గాత్రుల రోధ‌న‌ల‌తో ఘ‌ట‌నాస్థ‌లం శోక‌సంద్రంగా మారింది. ప్రమాద సంఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.