శరత్‌కుమార్‌కు కరోనా పాజిటివ్

హైద‌రాబాద్‌: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలు, రాజకీయ నేతలు సైతం ఈ వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా తమిళ సినీ నటుడు శరత్‌కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరినట్టు ఆటు రాధికా శరత్‌కుమార్‌, అలాగే తనయ వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. కరోనా లక్షణాలు ఏమీ లేకుండానే పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. ప్రస్తుతం శరత్ కుమార్ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్‌’లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.