శీతాకాలం తీసుకునే ఆహారం..
చలికాలంలో మనం మన శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు స్వెటర్లు, మఫ్లర్లు, మంకీ క్యాప్‌లు తదితర దుస్తులను ఎక్కువగా ధరిస్తుంటాం. అయితే మనం నిత్యం తీసుకునే పలు ఆహార పదార్థాలలో కూడా పలు మార్పులు చేసుకుంటే ఈ కాలంలో మన శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు. అందుకు మనం తీసుకోవలసిన ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.
- నువ్వులు, బాదం పప్పు, కోడిగుడ్లును తీసుకోవడం వల్ల శరీరాన్ని వేడిగా ఉంచుకోవచ్చు.
- పసుపులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల నిత్యం ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో ఒక టీస్పూన్ పసుపు కలుపుకుని తాగితే శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు.
- మన శరీరానికి వెచ్చదనం అందించడంలో అల్లం కూడా బాగానే పనిచేస్తుంది. నిత్యం అల్లం టీని సేవిస్తే చలి బారి నుంచి తప్పించుకోవచ్చు.
- నిత్యం ఒక గ్లాస్ గోరు వెచ్చని నీరు లేదా పాలలో ఒక టీస్పూన్ తేనె కలుపుకుని తాగితే శరీరం వెచ్చగా ఉంటుంది.
- దాల్చినచెక్క మన శరీర మెటబాలిజాన్ని పెంచుతుంది. దీంతో శరీర ఉష్ణోగ్రత పెరిగి వెచ్చదనం లభిస్తుంది. నిత్యం దాల్చిన చెక్క పొడి తీసుకుంటే ఫలితం ఉంటుంది.
- ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో ఒక టీస్పూన్ కుంకుమ పువ్వు లేదా నల్ల మిరియాల పొడి కలుపుకుని తాగితే శరీరానికి వెచ్చదనం లభిస్తుంది.
- అలాగే వేడి వేడి సూప్‌లను సేవించడం వల్ల కూడా చలికాలంలో మన శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు.
-పూర్ణిమ
Wow, superb weblog format! How long have you ever been running a blog for? you made running a blog glance easy. The full glance of your website is excellent, let alone the content!!