షుగర్ వ్యాధితో ఉన్నవారికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

ఈ రోజుల్లో చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసుల వారికీ షుగర్ వ్యాధి వస్తున్నది. ఈ దీర్ఘకాలిక వ్యాధి ఇంతలా పెరిగిపోవడానికి కారణం.. సమయపాలన లేని ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, ఒత్తిళ్లతో కూడిన జీవనవిధానమేనని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఒక్కసారి మనం సుగర్ బారిన పడ్డామంటే.. దానికితగ్గ మెడిసిన్లు వాడటం ఎంత ముఖ్యమో, తగిన ఆహార నియమాలు పాటించడం కూడా అంతే ముఖ్యం. లేదంటే ఒంట్లో చక్కెర స్థాయిలను అదుపులో పెట్టడం అసాధ్యం. కాబట్టి షుగర్ పేషెంట్లు ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
- భోజనంలో తప్పకుండ పచ్చి కూరగాయ ముక్కలు ఒక కప్పు తీసుకోవాలి.
- మీగడ తీసిన పాలతో చేసిన పెరుగు (1 చిన్న కప్పు ) లేదా మజ్జిగ (1 గ్లాసు ) తీసుకోవాలి.
- మాంసాహారులు అయితే ఈ క్రింద వాటిలో ఏదయినా ఒకటి వారానికి రెండు సార్లు తీసుకోవచ్చు.
- తోలు తీసిన కోడి మాంసం కూర (2 లేదా 3 ముక్కలు).
- మటన్ కూర (5 లేదా 6ముక్కలు).
- చేప కూర (2 ముక్కలు ).
- పచ్చసొన తీసిన గ్రుడ్డు (1).
తీసుకోకూడని ఆహార పదార్థాలు:
జీడిపప్పు, పిస్తా, కొబ్బరి, వేరుశనగపప్పు, బాదంపప్పు, కొబ్బరి నీళ్లు, హార్లిక్స్, బూస్ట్ శీతలపానియాలు, ఆల్కహాలు, తేనె, బెల్లం, ఐస్‌క్రీములు, కేకులు, జామ్.
తీసుకోవలసిన ఆహార పదార్థాలు:
ఉదయం తీసుకోవాల్సిన ఆహారం:
అల్పాహారం 8.00 గoటలకు చేయాలి. కాఫీ / టీ (మీగడ తీసీన పాలతో చక్కర లేకుండా చేసినది ) తీసుకోవాలి.
1వ రోజు: చపాతీ(2)+నూనె తక్కువగా వేసి చేసిన కూరగాయల కూర 1 కప్పు.
2వ రోజు: దోసె (2) +చట్నీ 1కప్పు
3వ రోజు: ఇడ్లీ(4) +చట్నీ 1కప్పు
4వ రోజు: గోధుమ రవ్వ ఉప్మా(2చిన్న కప్పులు )
5వ రోజు: పుల్కా(3) +నూనె తక్కువగా వేసి చేసిన కూరగాయల కూర 1కప్పు
6వ రోజు: పొంగలి (2 చిన్న కప్పులు ) +చట్నీ 1కప్పు
7వ రోజు: జొన్న రొట్టెలు (2)+నూనె తక్కువగా వేసి చేసిన కూరగాయల కూర 1 కప్పు
అల్పాహార 11.00 గంటలకు ఏమి తీసుకోవాలి.
1వ రోజు: నూనె లేకుండా వేయించిన పేలాలు (1చిన్న కప్పు)
2వ రోజు: నూనె లేకుండా వేయించినఅటుకులు(1చిన్న కప్పు )
3వ రోజు: నూనె లేకుండా వేయించినమరమరాలు(1చిన్నకప్పు )
4వ రోజు: మొలకె త్తించిన పెసలు(1చిన్న కప్పు)
5వ రోజు: సాదా బిస్కెట్లు (4)
6వ రోజు: జామ పండు (1) (దోరగ ఉన్నది)
7వ రోజు:బొప్పాయి పండు ముక్కలు(1చిన్న కప్పు ) లేదా అందుబాటులో ఉంటే నేరేడు పళ్లు.
భోజనం: మధ్యాహ్నం /రాత్రి భోజనం:
1వరోజు: చపాతీ(2)+అన్నం(1చిన్న కప్పు) పాలకూర పప్పు (1చిన్నకప్పు) బీరకాయ కూర (1పెద్ద కప్పు).
2వ రోజు: పుల్కాలు(3)+అన్నం (1చిన్న కప్పు)దోసకాయ పప్పు(1 చిన్న కప్పు ) సొరకాయ కూర (1పెద్దకప్పు).
3వ రోజు: జొన్నరొట్టెలు(2) + అన్నం (1 చిన్న కప్పు) టమోటా పప్పు (1చిన్నకప్పు ) కాబేజీ కూర (పెద్ద కప్పు).
4వ రోజు: అన్నం (2 చిన్న కప్పులు ) + చపాతీ (1) సాంబారు (1చిన్నకప్పు) బెండకాయకూర (పెద్దకప్పు )
5వ రోజు: అన్నం (2చిన్నకప్పులు)+ పుల్కాలు(2)తోటకూర పప్పు(1 చిన్న కప్పు)దొండ కాయ కూర(1 పెద్ద కప్పు).
6వ రోజు: గోదుమ రవ్వఅన్నం(3 చిన్న కప్పులు)సోర కాయ పప్పు(1 చిన్నకప్పు)దోసకాయ కూర(1పెద్ద కప్పు ).
7వ రోజు: అన్నం (3చిన్న కప్పులు) గోంగూర పప్పు(1 చిన్న కప్పు )టమోటా కూర/ఆకు కూర (1 పెద్ద కప్పు ).
సాయంత్రం అల్పాహారం 5.00 గంటలకు:
1వ రోజు: సాదా బిస్కెట్లు(5)
2వ రోజు: మొలకె త్తించిన పెసలు (1 చిన్న కప్పు ).
3వ రోజు: ఉడక బెట్టిన ముడి పప్పు గింజలు (ఉదా:శనగలు 1 చిన్న కప్పు).
4వ రోజు: బొప్పాయి పండు ముక్కలు(1 చిన్న కప్పు).
5వ రోజు: బత్తాయి పండు (1/2)+నూనె లేకుండావేయించిన మరమరాలు(1 కప్పు ).
6వ రోజు: జామ పండు (1)+ నూనె లేకుండా వేయించిన అటుకులు(1 చిన్న కప్పు )
7వ రోజు: ఉడక బెట్టిన ముడిపప్పు గింజలు (ఉదా : బటాణిలు (1 చిన్న కప్పు).
-టి.వి.గోవిందరావు