షూటింగ్ లకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

న్యూఢిల్లీ: ఎట్టకేలకు సినిమా షూటింగ్ లకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది.
అయితే కరోనా మార్గదర్శక సూత్రాలను పాటించాలని కేంద్రం సూచించింది.షూటింగ్ స్థలం వద్ద అనుసరివచవలసిన విధానాన్ని కూడా వివరించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న అన్‌లాక్-3 ఆగష్టు 31తో ముగియనున్న తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. సినిమా, టీవీ సీరియళ్ల షూటింగ్‌లకు కేంద్రం అనుమతి ఇస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. షూటింగ్ జరిగే చోట తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మాస్కులు దరించి ఉండాలని కేంద్రం తెలిపింది. బౌతిక దూరం పాటించడం అవసరమని తెలిపింది.ఆరోగ్య సేతు యాప్ ను వాడుకోవాలి. షూటింగ్ సమయంలో విజిటర్లను అనుమతించరాదు. మేకప్ మాన్, తదితరులు పిపిఈ కిట్లు వాడాలని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే షూటింగ్లో పాల్టొనే అందరికి గైడ్ లైన్స్ ఇచ్చారు.