షేక్.బహర్ అలీ: జ్వరం వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మానవ శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత (37°సె, 98.6°ఫా) కంటే మించి ఉంటే ఆ స్థితిని జ్వరం అంటారు. దీనిని థర్మామీటర్ ద్వారా కొలిచి గుర్తిస్తారు. మన శరీరంలోని సహజమైన రోగనిరోధక శక్తి రోగాల వైరస్‌లతో, బాక్టీరియా, ఫంగస్ లాంటి వాటితో జరిపే పోరాటంలో, శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. శరీర ఉష్ణోగ్రత 98.6 డిగ్రీస్ ఫారిన్ హీట్ దాటితే మన శరీరంలో ఇన్‌ఫెక్షన్‌తో అంతర్యుద్ధం కొనసాగుతున్నదన్నమాట.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
1. మూతికి ముక్కుకి మాస్క్ ధరించాలి.
2. వ్యక్తులకు, వ్యక్తులకు మధ్య దూరం పాటించాలి
3. ఎప్పటికప్పుడు చేతులు సబ్బుతో శుభ్రంగా కడగాలి.
4. శుభ్రమైన దుస్తులు ధరించాలి.
5. కోవిడ్ వైరస్ ఉన్న వ్యక్తులు ఎటువంటి పరిస్థితులలో బయటికి రావద్దు.
6. ప్రతిరోజు ఇల్లు శుభ్రంగా ఉంచాలి.అంటువ్యాధులు రాకుండా ఉంటాయి.గుగ్గిలం సాంబ్రాణి సమాన భాగాలు కలిపి వేడి బొగ్గుల మీద వేసి ఇల్లంతా దూపం పెట్టాలి.
హెచ్చరిక..
1. పొడి దగ్గు లవంగాలు ఎక్కువగా తింటే వస్తుంది.
2. పసుపు కూడా ఎక్కువగా పాలలో వాడరాదు. వారానికి2 సార్లు వాడాలి. లేకపోతే పొడి దగ్గు వస్తుంది.
గృహచికిత్సలు: పొడి దగ్గు బాగా వస్తే అతిమధురం పొడి టీ స్పూన్, తేనే టీ స్పూన్ నాకితే దగ్గు తగ్గుతుంది.
తిన్న వెంటనే వజ్రాసనం 10 నిమిషాలు వేయాలి.
ఉదయం /సాయంత్రం పరిగడుపున భాస్త్రిక, కాపాలభతి, అనులోమ విలోమము ప్రాణాయామం మరియు ఉజ్జయిని చేయాలి.
హెచ్చరిక… షుగర్ ఉంటే కోవిడ్ పేషెంట్కి జ్వరం అసలు తగ్గదు. కనుక షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో పెట్టుకివాలి.
గర్భవతులు, పాలిచ్చే తల్లులు, షుగర్ పేషెంట్స్, ఆస్తమా, సైనస్, టీబీ, వీరందరూ జాగ్రత్తగా ఉండాలి. వీరికి కోవిడ్ వైరస్ త్వరగా వస్తుంది. ఒక వేళ వస్తే డాక్టర్ సలహా మేరకు ట్రీట్మెంట్ తీసుకోండి. ఇవన్నీ డాక్టర్ సలహా మేరకు వాడండి.
టీ మందులాగా బాగా పనిచేస్తుంది.
1. అల్లం చిన్న ముక్క 3 గ్రాములు.
2. తులసి ఆకులు 3.
3. మిరియాలు 3
4. ఇలాయిచి 1
5. బెల్లం తగినంత
6. ఒక పెద్ద గ్లాస్ లో నీరు
7. టీ స్పూన్ తేనే
వీటన్నింటిని నీటిలో కలిపి బాగా మరిగించి 1/4 వంతు చేసి వడపోసి తరువాత టీ స్పూన్ తేనే కలిపి తాగండి. ఒక మూడు రోజులు తాగండి కరోన వైరస్ మలం ద్వారా బయటికి పోతుంది.
8. ప్రతిరోజు మజ్జిగ తాగాలి. బ్యాక్ట్రియను చంపుతుంది. దీనిలో మిరియాల చూర్ణం చిటికెడు కలిపి తాగితే వైరస్ దెబ్బకు చస్తుంది.వైరస్ ని చంపగల గుణం ఒక మిరియాలకు మాత్రమే చెల్లుతుంది.
9, ఊపిరితిత్తులో్లని ఇన్‌ఫెక్షన్ ను శుభ్రం చేయడానికి చవాన్ ప్రాశ్ లేహ్యము, అగస్త హరితకి అవలేహ్యము ఇవి వైరస్‌ను, టిబిని, బ్రాంకటైస్‌ను, ఆస్తమా, సైనస్ జబ్బులకు మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది.
మధుమేహం ఉన్నవారు, గర్భవతులు, పాలిచ్చే తల్లులు డాక్టరును సంప్రదింది వాడగలరు
ఇంట్లోనే ఉంటూ వైద్యుల సూచనల మేరకు కరోనా చికిత్స తీసుకోండి. ఏమైనా సలహాలు కావాలంటే సంప్రదించండి.
–షేక్.బహర్ అలీ
యోగచార్యుడు
సెల్: 7396127557
Wow, amazing blog structure! How long have you been running a blog for? you made running a blog look easy. The full glance of your site is fantastic, let alone the content!!