షేక్.బహర్ అలీ: పవన ముక్తాసనం

పవన ముక్తాసనం.. పంచ ప్రాణాలలో ఒకటైన అపాన ప్రాణం క్రింది వైపుకి ఉంటుంది. ఈ అసనంలో కడుపులోని వాయుని సహజంగా బయట పడుతుంది. కనుకనే ఇది పవన ముక్తాసనం.

చేయు విధానం:

ముందుగా నేల మీద వెల్లకిల్లా పడుకోవాలి.కాళ్ళను తిన్నగా చాపి ఉంచాలి. రెండు మడమలను, వేళ్ళు కలిపి ముందుకు లాగి వుంచాలి. రెండు చేతులను శరీరంతో పాటు, బిగించాలి. కుడి మోకాలును మడవాలి. రెండు చేతుల వేళ్ళను ఒకదానితో ఒకటి అల్లి మోకాలు పైన ఉంచి శ్వాసను నింపి ముడుకుతో పొట్టను నొక్కాలి. 30 సెకనుల వరకు ఇలానే వుంచాలి. శ్వాసను బయటకు వదులుతూ నాసికను ముడుకుతో అనించాలి. లేదా స్పృశించాలి. యధా స్థితిలో ఉండాలి. శ్వాసను నింపుతూ మెల్ల మెల్లగా తిరిగి యధా స్థితికి రావాలి. బిగువునూ సడలించాలి. ఇదే పద్దతిలో ఎడమ కాలితోను, ఆపైన రెండు కాళ్లతోను ఆచరించాలి. శరీరాన్ని విశ్రాంతి లో వుంచాలి.

ధ్యాన కేంద్రం.. మణిపూర చక్రం..

ప్రయోజనాలు:

1. కుడికాలును పొట్ట మీద వేసి నొక్కటం వలన పైకి వెళ్లే పెద్ద పేగు, సిగ్మాయిడ్ కోలాన్ ప్రభావానికి లోనవుతాయి. రెండు కాళ్లతోను పొట్ట పైన నొక్కటం వలన వంకరగా పోయే పెద్ద పేగుతో పాటు నాడీమండలం అంత పూర్తిగా ప్రభావానికి లోనవుతుంది.

2. పొట్టలోని అపాన వాయువు(గ్యాస్)పోవటం వలన గుండె దడ మరియు గాభరా తగ్గుతుంది. శ్వాస బాగా నడుస్తుంది. శరీరం తెలికగా వుంటుంది.

3. ఊపిరితిత్తులు, గుండెకు సంబంధించిన జబ్బులు రావు. ఉన్న వాటి జబ్బులు తగ్గుతాయి.

4. స్థూలకాయం అంటే ముందు వేలాడుతున్న బెల్లి ఫ్యాట్ తగ్గుతుంది.

5. మహిళ మహారాణులకు సంబందించిన వ్యాధులు రావు, ఉన్న వ్యాధులు తగ్గుతాలు.

6. మణిపూర చక్రము చైతన్యవంతంగా మారును. వీర్యస్ఖలనం, స్వప్న దోషాలు తగ్గును.

7. రెండు మోకాళ్ళతో పొట్టను నొక్కటం వలన జీర్ణాశయం, ప్లీహం, గుండె, కూడా ప్రభావితమౌతాయి. షుగర్ పేషెంట్స్ కి ఇన్సులిన్ ఆక్టివ్ అవుతుంది. షుగర్ కంట్రోల్ అవుతుంది.

8. పేగులు కూడా బలపడి, వాటికి సంబంధించిన జబ్బులు తగ్గును.

9. పవన ముక్తాసనంలో ముందుకు, వెనక్కు పుచ్చకాయ లాగా డొల్లటం వలన వెన్నుముక దృఢంగా మారును.

హెచ్చరిక: ఈ ఆసనం వేస్తున్నంతసేపు పంజా ముందుకు సాగి ఉండాలి. శ్వాసను బయటకు వదిలి, నాసికను ముందుకు అనించాలి. తిన్నగా ఉంచిన ముడుకు ఏ మాత్రం వంగకూడదు. రెండు కాళ్ళు మడిచినపుడు ముక్కు, రెండు ముడుకుల మధ్య వుంచాలి. శరీరాన్ని సాధ్యమైనంత వరకు దగ్గరగా ముడుచుకోవాలి. గుండెపోటు, బీపీ, నడుము నొప్పి ఉంటే యోగ గురువు జి సమక్షంలో నేర్చుకోవాలి.

-షేక్.బహర్ అలీ.
యోగాచార్యుడు

త‌ప్ప‌క చ‌ద‌వండి:

బహర్ అలీ: పార్శ్వ కోణాసనం

బహర్ అలీ: పరివృత్త త్రికోణాసనం
స్త్రీ, పురుషులకు ఉపయోగకరమైన త్రికోణాసనం)
(షేక్.బహర్ అలీ: శిశిర ఋతువులో చ‌క్క‌టి ఆరోగ్యానికి..)

షేక్.బహర్ అలీ: నడక.. లేపుతుంది పడక నుండి..

Leave A Reply

Your email address will not be published.