షేక్.బహర్ అలీ: నడక.. లేపుతుంది పడక నుండి..

మార్నింగ్ వాకింగ్ వలన లాభాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రవాణా సౌకర్యాలు సరిగ్గా లేని రోజులలో దూరపు ప్రయాణాలు చాలా మంది కాలి నడక ద్వారా కొన్ని వందల కిలోమీటర్లు నడిచి వెళ్లి వచ్చేవారు. ఆ రోజులలో వారికి పిచ్చి పట్టటం అంటే మెదడుకు సంబంధించిన జబ్బులు వచ్చేవి కాదు. జీర్ణక్రియ జబ్బులు కూడా వచ్చేవి కావు. చక్కటి ఆహారం, చక్కటి నడక ద్వారా ఆరోగ్యం గా అప్పటి ప్రజలు ఉండేవారు.

కానీ 4 దశాబ్దాల నుండి ప్రజలు రవాణా సౌకర్యాలు, రోడ్డు మార్గాలు పెరగటం వలన వాహనాల ద్వారా మనం దూరపు ప్రయాణాలు చేస్తూ నడక ద్వారా పోవటం మొత్తానికి మానివేసినాము.. ఒకప్పుడు చిన్న చిన్న పనులకు ఒకటి లేదా 3 కిలోమీటర్లు వరకు కాలి నడకన పోయివచ్చేవారు. కొంత కాలనీ సైకిల్ వచ్చింది. సైకిల్ రావటం వలన దాని మీద చక్కగా కూర్చొని వెళుతున్నాము. దానితో ఆ దూరపు నడకను కూడా నడవటం లేదు.. తరువాత బైక్ రావటం జరిగింది. అసలు నడకే పూర్తిగా పడకేసము, అంటే మానివేసినం. మరియు ప్రస్తుతం సెల్ ఫోన్ వాడుతూ ఒక చోట గంటల తరబడి కూర్చుంటున్నాము. దానితో శారీరక వ్యాయామం లేక శారీరక రోగాలు మరియు దాని మానసిక
జబ్బులు వస్తున్నాయి.

4 దశబ్దాల కింద ఒక వ్యక్తి వద్ద అతని జేబులో పెన్ను ఉంటే అబ్బా మంచి చదువు కలవాడిగా గుర్తించేవారు. తరువాత చేతికి వాచ్ పెడితే పెద్ద విద్యావంతుడిగా చూసేవారు. సైకిల్ ఉంటే ధనవంతుడిగా చూసేవారు. ఇంకేముంది కార్ ఉంటే ఊరికే పెద్ద మనిషిగా కోటీశ్వరుడుగా గుర్తించేవారు. అలానే నడక ఉన్నపుడు కాన్సర్, కిడ్నీలు, ఊపిరితిత్తులు జబ్బులు, ఆస్తమా, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, గర్భవతులకు సర్జరీ చేయటం లేదు, ఎక్కడో ఒకటి రెండు అపాయం ఉంటే సర్జరీ చేసేది, అలాంటి రోజులు పోయినాయి.

ఎప్పుడైతే నడకను తగ్గించమో శరీరానికి రోగాలు వచ్చి పడకన పడ్డాం. అందుకే ఇప్పుడు అందరూ ఆరోగ్యం కాపడుకోవటానికి మరల పాత పద్ధతులు ద్వారా నడకను అలవాటు చేసుకున్నారు. దరిదాదాపు నడక వలన కొన్ని జబ్బులు రాకుండా.. గ్యాస్, actd, మలబద్దకం, అజీర్తి, మోకాళ్ళ నొప్పులు రాకుండా కాపాడుకుంటున్నారు. ఇప్పుడు నడక ఫ్యాషన్ గా మరింది. చాలా మంది ఉదయం 5 గంటలకు వాకింగ్ చేస్తున్నారు. వారు ఆరోగ్యానికి మంచిగా కాపాడుకుంటున్నారు.

ఇదే నడకను ఈ రోజున గొప్పగా భావిస్తూ, అందరూ నడకను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది చాలా సంతోషంకరమైన విషయం. ఎవరైనా ఉదయం వాకింగ్ పోయి వస్తే, ఏంది రా వాకింగ్ పోయివచ్చినవా? అయితే నేను కూడా రేపటి నుండి నీతో వస్తా అని చాలా గొప్పగా స్నేహితుడితో చెప్పుకుంటున్నారు.

నడవటం వలన కలిగే లాభాలు…

తెల్లవారుజామున లేవగానే రెండు గ్లాసులు నీరును తాగాలి.చలి కాలం అయితే గోరువెచ్చని నీరు, ఎండ కాలం అయితే కుండలో నీరు తాగండి. వీలుంటే అన్ని కాలలో రాగి చెంబులో 5 తు లసి ఆకులు రాత్రి పూట వేసి తెల్లవారు తాగాలి. తరువాత కాలకృత్యములు చేసుకొని మార్నింగ్ వాక్ కి వెళ్ళాలి.

ఉదయం ఖాళీ కడుపుతో నడకకి వెళ్ళటం చాలా ఉత్తమము. కడుపు నిండా తిని ఉంటే శరీరానికి మంచిది కాదు. భోజనం తిన్న తరువాత ఆహారం 20 నిమిషాలకు జీర్ణం అవ్వటం ప్రారంభం అవుతుంది. భోజనం తరువాత శరీరంలో ఎక్కువ శక్తి, రక్తం, ఆక్సిజన్, భోజనాన్ని అరిగించటానికి ఉదరం వైపు పరుగెత్తుతాయి. ఆ సమయంలో గుండె జబ్బు ఉన్న రోగులలో గుండె ధమనుల ఆగిపోవటం వలన గుండెకు సంపూర్ణంగా పోషణ, ఆక్సిజన్ లభించవు. అలానే భోజనం చేసిన తరువాత నడకను వెళ్ళటం, ఏదైనా శారీరక, మానసిక శ్రమ చేస్తే అదనపు శక్తి, ఆక్సిజన్ అవసరమౌతాయి. ఇలాంటి స్థితిలో జీర్ణం చేయాలా, నడకకి లేదా లేదా ఇతర ఏ రకమైన శ్రమకైనా, లేదా స్వంతంగా తన కోసం రక్తం, ఆక్సిజన్, శక్తిని సరఫరా చేసుకొనే అవసరం ఉందొ గుండె నిర్ణయించుకోలేకపోతుంది. ఫలితంగా సంశయగ్రస్తంగా వుంటుంది.

నిజానికి నడక వలన శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఏందికంటే కాలి నడకతో పాదాల కింద ఆక్యుప్రెషర్ జరిగి రక్తం గుండె నుండి పాదాల వరకు రావటం, తీరిగి కింద పాదాల నుండి గుండె వైపుకి వెళ్ళటం జరుగుతుంది. దీనితో వేరికోస్ వెయిన్స్ రావు.

మధుమేహ రోగులకు, గుండె పోటు, బీపీ ఉన్నవారికి నడక ఒక గొప్ప ఔషధం లాంటిది. ఈ రోగాలకు మంచి చికిత్స. నడక వలన రక్తంలో గుండెకు పోషణ ఇచ్చే మంచి కొలెస్ట్రాల్ హైడెన్సీటీ లైపో ప్రోటీన్, (H. D. L.) ఎపోలియో ప్రోటీన్ a 1 పెరుగుతుంది. గుండె రక్తకేశ నాళికల్ని దెబ్బ తీసే శత్రువు కొలెస్ట్రాల్ లో డెన్సిటీ లైపో ప్రోటీన్, (L. D. L) మోతాదు బాగా తగ్గుతుంది. గుండె సామర్ధ్యం బాగా పెరుగుతుంది. ఆగిపోయిన కరోనరి ధమనులతో గుండెకు పోషణ ఇవ్వటానికి కొత్త చిగుళ్ల వలే కొన్ని కొత్త రక్త ధమనులూ వికసిస్తాయి. మూసుకోపోయినా ధమనులు మెల్లమెల్లగా తెరుచుకుంటాయి.

తెల్లవారుజామున ప్రశాంతంమైన వాతావరణంలో, చల్లని చిరు గాలిలో, ఆహ్లాదకరమైన, ఆనందకరమైన వాతావరణంలో, పిచ్చుకలు, పక్షుల, కోడి కూతలు వింటుంటే చెవులకు వింపుగా, శరీరంలో ఎదో తెలియని వింతగా ఉంటుంది. దీనితో ఎంతో ఆనందంగా ఉన్నామని అనిపిస్తుంది.

నిజానికి బయట ప్రశాంతమైన కాలుష్యరహితమైన గాలిలో నడక సాగించటం ఆరోగ్యానికి, అధ్యాత్మికంగా చాలా మంచిది.

ఆ సమయంలో నకడ తో ఊపిరితిత్తులకు మంచి ఆక్సిజన్ అంది రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. తిన్న ఆహారం, శరీరంలో రసం, రక్తం, మాసం, మేధస్సు, మజ్జ, ఆస్థి, శుక్రుగా చక్కగా జరిగి రోగనిరోధక సామర్ధ్యం పెరుగుతుంది. శరీరంలో ఉన్న విష వాయువు బయటికి వెళ్లి రోగాలు రాకుండా కాపాడుతుంది.

నడకను వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఈ క్రింద విధంగా తీసుకోండి.

  • 1. మొదట సారిగా నడకకు వెళ్ళినపుడు నిదానంగా ప్రారంభించాలి. కొన్ని రోజుల తరువాత దానిని వేగంగా నడవటం అలవాటు చేసుకోవాలి. రోగిలాగా కాకుండా ఆరోగ్యవంతుడిగా చలాకీగా, చురుకుగా, నడకను చేయాలి.
  • 2. నడకను ఆరు బయట వెళ్ళినపుడు వెలుతురుగా ఉన్నపుడు వెళ్ళండి, చీకటిలో పోవద్దు.
  • 3. ఒక కొంత సమయంలో 20 నిమిషాలలో 3 కిలోమీటర్స్ నడచి వచ్చేలాగా చూసుకోవాలి. మొదట నిదానంగా నడకను ప్రారంభించి నడకను వేగగంగా పెంచుతుపోవాలి.
  • 4. నడిచేటపుడు శారీరకంగా, మానసికంగా, ఆందోళన లేకుండా ఉండాలి. మాట్లాడుతూ నడవరాదు. మౌనంగా ఉండాలి. రోడ్డు కు ఏడ వైపు మాత్రమే నడవాలి. మనం నడుస్తున్నవుడు నడక మీదనే ధ్యాస వుంచాలి. నడుస్తున్నప్పుడు శరీరంలో అవయవాలు అంటే చేతులు కూడా ముందుకు వెనక్కి ఊపుతూ నడవాలి. ఊపిరితిత్తులకు మంచిది. ఎటువంటి చేడు ఆలోచన లేకుండా మరియు చేయబోయే పనుల గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా నడవాలి. దానితో శరీర భాగాలు వేడి ఎక్కి చెమట బయటకు వస్తుంది.
  • 5. ఉదయించే సూర్యుని లేత కిరణాలతో శరీరం లో చురుకుతనం పెరిగి మస్తిష్కం చైతన్యవంతంగా మారుతుంది.
  • 6. నడక చేసేటపుడు చేతిలో చిన్న నీటి bottle ఉంచుకోండి. మధ్యలో దాహం అయితే కొద్దిగా నీరు తాగండి.
  • 7. మౌనంగా నడక సాగిస్తే శరీరంలో శక్తి కోల్పోము. మాట్లాడుతూ నడిస్తే త్వరగా అలసి పోయి శక్తి కోల్పోయి నీరసం వస్తుంది. మౌనగం నడిస్తే ఆరోగ్యంగా ఉంటాం.
  • 8. నడిచేటపుడు చేతులు ముందుకు, వెనక్కి, మరియు చేతులు పైకి లేపటం, చేతులు భూమికి సమాంతరంగా ఇరు పక్కల లేపటం ఇలాంటివి చేస్తూ నడవాలి.
  • 9. చేతులను మడిచి నడిస్తే శరీరంలో బయో మెకానిక్స్ రిథంలో చురుకుతనం కలుగుతుంది. కాళ్ళు చేతులు మధ్య ఒక విధమైన సంతులనం ఉంటుంది. దీని వలన శరీరంలో అన్ని భాగాలు చైతన్య వంతమై చురుకుగా ముందుకు నడక సాగేలా చేస్తుంది.
  • 10. నడకలో నడుము వంగరాదు. వెన్నుముక, మెడ తిన్నగా ఉండాలి, ఛాతి ముందుగా, మొఖం కొద్దిగా కింద వైపుగా ఉండాలి. నడిచేటపుడు కాళ్ళు ఈడ్చుకుంటూ, నెలకేసి కొట్టుకుంటూ, కాళ్ళను వంకరగా, టింకరగా నడుస్తూ పోవద్దు. దీని వలన త్వరగా అలసిపోతాము. అలా నడవటం వలన భూమి గురుత్వాకర్షణ కారణంగా గుండె, ఊపిరితిత్తులు, వెన్నుముక కండరాలపై ఒత్తిడి పడి అలసట కలుగుతుంది.
  • 11. నడిచేటపుడు వేగంగా, నిదానంగా నడవ వద్దు. ఒక పద్ధతి ప్రకారం నడవండి. నడిచేటపుడు శ్వాసను మీద ధ్యాస ఉంచండి. శ్వాస వదులుతూ పీల్చుతు ఉంటే ఒక రకమైన అనుభూతిని పొందుతూ ఉంటాం.
  • 12. నడుస్తున్నప్పుడు ఎత్తు పల్లాలు వస్తుంటాయి, వాటిని కింద చూసుకొని నడవాలి. లేకపోతే కిందకు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
  • 13. నడుస్తున్న సమయంలో పాదాలు చైతన్యవంతంగా మారి కాలి కండరాలలో రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. మనసులో వ్యర్థమైన ఆలోచనలు ఉండరాదు.
  • 14. మార్గం మధ్యలో దాహం వేస్తే నీరు తాగండి. ఎక్కువగా అలసిపోతే కొంతసేపు విరామం ఇవ్వండి. గుండెలో నొప్పి వస్తే ఒక అర గంట ఆగి నడవాలి.
  • 15. నడకను వెళ్లి రాగానే వెంటనే పడుకోవద్దు. కొన్ని చిన్నచిన్న శారీరక వ్యాయామాలు చేయండి. ప్రాణాయామం, భస్త్రిక, కపాలభాతి, అనులోమ విలోమము చేయండి. మెదడు కు, ఊపిరితిత్తులకు మంచి ఆక్సిజన్ అంది, జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది. తిన్న ఆహారపదార్థాలు చక్కగా అరుగుతాయి. కాన్సర్ పక్షవాతం, జబ్బులు రావు.
  • 16. నడకను వెళ్లి వచ్చిన తరువాత పండ్ల రసాలు లేదా పాలు, లేదా, రాగి, జొన్న, బార్లీ, జావాలు తాగండి.
  • 17. మధుమేహం ఉంటే రాగి జావా తాగండి. ఖీరా, టమాటా, ముల్లంగి, కాకరకాయ, సలాడ్ తినండి. కారకాయ జ్యూస్ కూడా తాగవచ్చును. మరియు రెండు టీ స్పూన్స్ కలబంద జ్యూస్, రెండు టీ స్పూన్స్ ఉసిరికాయ జ్యూస్, నాలుగు టీ స్పూన్ నీరు కలిపి తాగండి.. మధుమేహం రోగుల కణాలు, కణజాలలో ఉన్న అదనపు గ్లూకోజ్ని ఉపయోగించుకొనే సామర్ధ్యం పెరుగుతుంది. కాలేయం, అగ్నాశయం, వాటి కార్యకలాపాలు నిర్వహించటం వల గ్లూకోజ్ అదుపులోకి వస్తుంది.
  • 18. నడక చేయటం వలన శిరల లోపల రక్తప్రసరణ నియంత్రితంగా, వ్యవస్థీకృతంగానూ జరుగుతుంది. శిరలలో వాల్వులు ఉండటం వలన రక్తప్రసరణ కేవలం గుండె వైపే జరుగుతుంది. ఏదైనా వ్యాయామం చేసినపుడు కండరాలు ముడుచుకోవటం వలన వాటి దగ్గర గా ఉన్న శిరలు అణుగుతాయి. లేచినపుడు ఒత్తడి.తగ్గుతుంది.
  • ఈ విధంగా నడక వలన శిరలలో రక్త ప్రవాహం వేగంగా జరుగుతుంది. రక్తం శుద్ధి అవుతుంది.

హెచ్చరికలు…
కాలాన్ని బట్టి వస్త్రాలు ధరించి నడకకి వెళ్ళండి. కాళ్లకు బూట్లు ధరించండి. చెప్పులతో నడిస్తే కాలి బొటన వేలు, పెద్ద వేలు మధ్య చెప్పు రాపిడితో పుండు పడే అవకాశాలు ఉన్నాయి. మోకాళ్ళ, నడుము నొప్పి గుండెపోటు ఆయాసం, ఆస్తమా, సైనస్ ఉంటే డాక్టర్లు సలహాతో వెళ్ళండి.

ఉదయం బ్రహ్మమమూహర్తం కాలంలో నడవటం వలన శరీరంలో ప్రతి అంగాలు, ప్రత్యంగాలు, స్నాయువులు, తంతువులు, కండరాలు అన్ని చక్కగా పనిచేస్తాయి.

రాత్రి నిదురలో కర్మేంద్రియాలన్ని నిధురపోయినా సరే గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, నిదురపోవు, “చరైవేతి చరైవేతి” మూలమంత్రంతో పగలేనక, రాత్రేనక పనిచేస్తూనే ఉంటాయి. వాటికి రోగం రాకుండా వాకింగ్ 30 నిమిషాలు ప్రతీ అందరూ చేయండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ శీర్షిక నచ్చితే కామెంట్ చేయగలరు.

-షేక్.బహర్ అలీ.
యోగాచార్యుడు

Leave A Reply

Your email address will not be published.