షేక్.బహర్ అలీ: వజ్రాసనం

వజ్రాసనం.. అంటే వజ్రనాడి ప్రభావితం ఐ శరీరం వజ్రంలాగ తయారౌతుంది. గనుక ఈ ఆసనానికి ఈ పేరు వచ్చినది. ధ్యానాసనం ఆచరించటం కష్టం అనుకునేవారు ఈ అసనములో ధ్యానానికి కూర్చోవచ్చు.
వజ్రాసనం చేయు విధానం..
అసనంపై కూర్చొని రెండు పాదాల మడమలను, వేళ్ళను ముందుకు జాపాలి. రెండు అర చేతులు కుడివైపు ఉంచి శరీర భారాన్ని అంతటిని దానిపై మోపి రెండు కాళ్లు ముడుకులనూ మడవాలి. మడమలను విడదీసి వాటిపైన కూర్చోవాలి. రెండు ముడుకులనూ, వేళ్ళను కలిసేలా ఉండాలి. ఒక కాలి బొటనవేలు రెండోవ కాలి బొటన వేలు మీద స్థిరంగా ఉండాలి.
రెండు అర చేతులు ముడుకుల మీద ఉండాలి. శరీరం వదులుగా,మెడ, నడుము, తిన్నగా ఉండాలి. శ్వాస సామాన్యంగా ఉంచుకోవాలి. సాధ్యమైనంత సేపు కూర్చోవచ్చును. కానీ బలవంతంగా, అంటే అప్రయత్నంగా కూర్చోరాదు.
ప్రయోజనాలు..
- కాలిపిక్కలపైన తొడల బరువు పడటం వలన కాలినరాలలో వేడి పుడుతుంది. దీనివలన పొత్తి కడుపులో అంగాలు చురుకుగా పనిచేస్తాయి. జీర్ణశక్తి బలపడుతుంది. ముడుకులు, తొడలలో బిగువు ఏర్పడటం వలన ఇవి ఆరోగ్యంగా ఉంటాయి.
- ఇది ధ్యానాత్మక ఆసనం. మనోచాంచల్యమును తొలిగించును.
- దీర్ఘకాలముగా సుఖముగా కూర్చోనుటకు వీలగును. నరముల వాపు తగ్గుటకు ఉపయోగపడును. బిగుతుగా ఉన్న చిలమండలములను, మోకాళ్లను వదులు చేయును.
- మోకాళ్ళ నొప్పులు తగ్గించును.
- మెడ, నడుము బిగువుగాను, మిగిలిన శరీరాన్ని వదులుగాను వదిలేయడం వలన శరీరానికి విశ్రాంతి లభిస్తుంది.
- ఏక్కువ నడవటం వలన, సైకిల్ తొక్కటం వలన కలిగే అలసట ఈ ఆసనం ద్వారా దూరం అవుతుంది.
- మీరు ప్రతిరోజు 5 కిలోమీటర్లు నడిచి పోయి వచ్చినంత లభించే గుణాలన్నీ ఈ ఒక్క వజ్రాసనం 10 నిమిషాలు వేస్తే చాలు బాగుంటుంది.
- vericose viens వలన వచ్చే బాధలు ఈ వజ్రాసనం వేస్తే తగ్గుతుంది.
- గ్యాస్ కి అద్భుతమైన ఆసనం, వజ్రాసనం. వజ్రాసనం వేస్తే గ్యాస్ బయటికి పోయి పొట్ట తగ్గుతుంది.
- ఎన్ని అసనములు ఉన్న సరే, భోజనం చేసిన తరువాత వేసే ఆసనం ఒక్కటే ఉంది, అదే వజ్రాసనం.
-షేక్.బహర్ అలీ
యోగచార్యుడు