షేక్.బహర్ అలీ: శూన్యముద్ర
శూన్యముద్ర.. నడిమివ్రేలు ఆకాశతత్వం యొక్క ప్రతినిధిత్వమోనర్చును. దీనిని అంగుష్టమూలముతో ఆనించి దానిని తేలికగా అణిచియుంచవలెను. మిగిలిన వ్రేళ్ళను చక్కగా ఉంచవలెను.
ప్రయోజనాలు…
ఈ ముద్ర వలన చెవులలో చీము కారుట, చెవులనొప్పి, వినికిడి తక్కువ మున్నగు రోగములు దీర్ఘకాలము వరకు, అనగా కనీసం ప్రతి దినం ఒక గంట వరకు చేయుట వలన తొలగిపోవును. ఎముకల బలహీనత మరియు హృదయ రోగములు చక్కబడును. దంతముల చిగుళ్లు గట్టిబడును. గొంతు సంబంధిచిన రోగాలు, థైరాయిడ్ రోగాలు తగ్గును.
హెచ్చరిక: నడుస్తున్నప్పుడు, భోజనం చేస్తున్నపుడు, ఈ ముద్ర వేయరాదు. భోజనానికి గంట ముందు, భోజనం చేసిన 4 గంటల తరువాత, టిఫినికి గంట ముందు, టిఫిన్ చేసిన 2 గంటల తరువాత ఈ ముద్ర చేయాలి.
-షేక్.బహర్ అలీ
యోగచార్యుడు
