సంక్షోభంలోనూ సంక్షేమానికే పెద్దపీట: మంత్రి పువ్వాడ

◆ పథకాల అమలులో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ◆ చింతకాని మండలంలో కళ్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ

మ‌ధిర: టీఆర్ఎస్ స‌ర్కార్ ఈ కోవిడ్ సంక్షోభంలోనూ సంక్షేమానికి పెద్ద‌పీట వేసింద‌ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు. మధిర నియోజకవర్గం చింతకాని మండలంలో కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకం కింద మంజూరైన 110 చెక్కులను గాను 1.10 కోట్లు(1,10,12,760) విలువైన చెక్కులను లబ్ధిదారులకు మంత్రి పువ్వాడ స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేద, ధనిక తారతమ్యం లేకుండా సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధినాయకత్వంలో పురపాలక మంత్రి కేటీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతోందని తెలిపారు. ప్రజలకు కావాలసిన సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతోంది పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక అయిన కళ్యాణలక్షీ పథకం ఆడపిల్లకు ఓ వరం లాంటిదని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా, తెలంగాణ రాష్ట్రంలోనే అద్భుతమైన పథకం ఉండడం ఎంతో గర్వంగా ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టోలో లేకున్నా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ రాష్ట్రంలో అమలు చేయడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. నేటి పరిస్థితులలో ఆడపిల్ల పెళ్లి చేయడానికి, ఎన్నో ఇబ్బందులు పడుతున్న తరుణంలో కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా లక్ష నూట పదహారు రూపాయలు ఇవ్వడం అనేది చాలా సంతోషించదగ్గ విషయమన్నారు.

Leave A Reply

Your email address will not be published.