సచిన్‌ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ

ప్రపంచ క్రికెట్‌లో మేటి బ్యాట్స్‌మెన్‌ గా విమర్శకుల ప్రశంసలను సైతం పొందిన విరాట్‌ కోహ్లీ.. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 12 వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కారు. ఆస్ట్రేలియాతో కొనసాగుతోన్న మూడో వన్డేలో టీం ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరో కొత్త రికార్డును సాధించారు.

సచిన్‌ వారసుడిగా జట్టులోకి వచ్చిన కోహ్లీ ఆటలో తన ప్రతిభా ప్రదర్శనతో కొద్దికాలంలోనే సారథిగా బాధ్యతలు చేపట్టారు. క్రికెట్‌ సమాజంలో ఈ కోహ్లీ ‘పరుగుల యంత్రం’ రికార్డుల ఢంకా మోగిస్తోంది. విరాట్‌ కోహ్లీ ఎప్పుడూ పరుగుల దాహంతో ఉంటాడని తన పరుగుల రికార్డులను చూస్తే అర్థం అవుతుంది. తన కెరీర్‌లో 251 మ్యాచులాడిన కోహ్లీ 242 వ ఇన్నింగ్స్‌ లో 12 వేల మైలురాయిని అందుకున్నారు. భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ 12 వేల పరుగులను చేయడానికి 309 ఇన్సింగ్స్‌ తీసుకున్నారు.

ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌ లో విరాట్‌ కోహ్లీ 22 వేల పరుగులను పూర్తి చేశారు. దీనికి కోహ్లీ కేవలం 462 ఇన్నింగ్స్‌ తీసుకున్నారు. క్రికెట్‌ దిగ్గజాలైన సచిన్‌ 493, బ్రియన్‌ లారా 511, రికీ పాంటింగ్‌ 514 ఇన్సింగ్స్‌లలో ఈ ఘనతను సాధించారు. వన్డేలో 12 వేల పరుగులు చేసిన ఆటగాళ్లలో టీమిండియా ఆటగాళ్లు ఇద్దరుండగా.. ఆస్ట్రేలియా నుండి రికీ పాంటింగ్‌, శ్రీలంక నుండి ముగ్గురు ఆటగాళ్లు ఉండటం గమనార్హం.

వన్డేలో 12 వేల పరుగులు చేసిన ఆటగాళ్లు..

  • 1.విరాట్‌ కోహ్లీ (242 ఇన్నింగ్స్‌)
  • 2. సచిన్‌ తెందూల్కర్‌ (300)
  • 3. రికీ పాంటింగ్‌ (314)
  • 4. కుమార సంగక్కర (336)
  • 5. సనత్‌ జయసూర్య (379)
  • 6. మహేల జయవర్దనే (399)
Leave A Reply

Your email address will not be published.