సరూర్నగర్ సర్కిల్లో బీజేపీ హవా..

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ పోరులో సరూర్ నగర్ సర్కిల్ పరిధిలో బీజేపీ అభ్యర్థుల హవా కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్లతో పాటు తొలి రౌండ్లోనూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సూరూర్నగర్లోని ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ కొనసాగుతుండగా ఎన్నికల అధికారులు ప్రకటించిన తొలి రౌండ్ ఫలితాలు పరిశీలిస్తే.. చైతన్యపురి డివిజన్లో బీజేపీ అభ్యర్థి 4 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
`గ్రేటర్` కౌంటింగ్.. మినిట్ టూ మినిట్
ఇక, గడ్డి అన్నారం డివిజన్లో 2,800కి ఓట్లతో బీజేపీ అభ్యర్థి లీడ్లో ఉండగా.. కొత్తపేట డివిజన్లో 3 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో బిజెపి కొనసాగుతోంది. ఆర్కే పురంలో రెండు వేలకు పైగా ఓట్లతో, సరూర్ నగర్ డివిజన్లో 2400కు పైగా ఓట్లతో ముందంజలో ఉన్నారు బీజేపీ అభ్యర్థులు.