`గ్రేట‌ర్‌` కౌంటింగ్‌.. ‌మినిట్ టూ మినిట్

GHMC Election 2020 ( 150/ 150 )
Party Logo Lead Won
TRS 00 55
AIMIM 00 44
BJP 00 48
Congress 00 2
Others 00 0

లైవ్ బ్లాగ్‌… 

నేరెడ్ మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపు నిలిపివేత . స్వస్తిక్ ముద్ర కాకుండా ఇతర ముద్ర ఉన్న ఓట్లు మెజారిటీ కంటే ఎక్కువ ఉన్నందున నిలిపివేత. హైకోర్టు ఆదేశాల ప్రకారం లెక్కింపు నిలిపివేత. ఎస్ఈసీకి నివేదిక పంపిన రిటర్నింగ్ అధికారి

గ్రేటర్‌ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. మేయర్‌ ఎన్నికకు కీలకం కానున్న ఎంఐఎం పార్టీ

పీసీసీ అధ్యక్ష పదవికి ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి రాజీనామా. గ్రేటర్‌ ఎన్నికల్లో ఘోర పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

బీజేపీ కార్యాలయంలో సంబురాలు షురూ. గ్రేటర్‌లో 48 సీట్లతో సత్తా చాటిన బీజేపీ. 2023లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తామని బండి సంజయ్‌ ప్రకటన

 గోషామహల్‌ నియోజకవర్గంలోని 6 డివిజన్లను బీజేపీ గెలుచుకుంది. వారిలో బేగంబజార్ – శంకర్ యాదవ్ , గోశామహల్ – లాల్ సింగ్ , మంగల్ హాట్ – శశి కళ, జాంబాగ్ – రాకేష్ జైస్వాల్ ,గన్ ఫౌండ్రి- డాక్టర్ సురేఖ ఓం ప్రకాష్‌లు గెలుపొందారు

మౌలాలి డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి సునీత యదవ్‌ గెలుపు

మూసాపేట్ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి కోడిచర్ల మహేందర్ 556 ఓట్లతో గెలుపు

ఆల్విన్ కాలనీ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దొడ్ల వెంకటేష్ గౌడ్ 1249 ఓట్లతో గెలుపు

ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ముద్దం నరసింహ యాదవ్ 7470 ఓట్లతో గెలుపు

అల్లాపూర్ 116 డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సబిహా గౌసుద్దీన్ 10310 ఓట్ల మెజారిటీతో ఘన విజయం

హయత్ నగర్‌ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి కళ్లెం నవ జీవన్ రెడ్డి విజయం

నాగోల్ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి చింతల అరుణ సురేందర్ యాదవ్ విజయం

మాన్సూరాబాద్ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి కొప్పుల నర్సింహారెడ్డి విజయం

 

మల్లాపూర్లో టీఆర్ఎస్ అభ్యర్థి పన్నాల దేవేందర్‌ రెడ్డి విజయం

ఫతేనగర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పండాల సతీష్‌ గౌడ్‌ 2,493 ఓట్ల మెజారిటీతో గెలుపు

సోమాజిగూడ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వనం సంగీత విజయం

శేరిలింగంపల్లి డివిజన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి రాగం నాగేందర్ యాదవ్ 1443 ఓట్లు మెజారిటీతో విజయం

గోల్నాకా డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దాసరి లావణ్య 2,716 ఓట్ల మెజారిటీతో విజయం

చిలుకానగర్‌ 7వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి గోనె శైలజ 200 ఓట్ల మెజారిటీతో గెలుపు

కొత్తపేటలో బీజేపీ అభ్యర్థి నాగకోటి పవన్‌కుమార్‌, సరూర్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి ఆకుల శ్రీవాణి అంజన్‌ విజయం

గడ్డిఅన్నారంలో బీజేపీ అభ్యర్థి బద్ధం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి విజయం

వినాయక్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి రాజ్యలక్ష్మి విజయం

అమీర్‌పేటలో బీజేపీ అభ్యర్థి కేతినేని సరళ విజయం

రామంతపూర్‌లో బీజేపీ అభ్యర్థి బండారు శ్రీవాణి విజయం

ఖైరతాబాద్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయారెడ్డి విజయం

కూకట్ పల్లిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జూపల్లి సత్య నారాయణ గెలుపు

హస్తినపురంలో బీజేపీ అభ్యర్థి సుజాత నాయక్ 680 ఓట్లతో గెలుపు

కె.పి.హెచ్‌.పీ డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి మందాడి శ్రీనివాసరావు 1540 ఓట్ల మెజారిటీతో విజయం

వనస్థలిపురం డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి రాగుల వెంకట్ రెడ్డి గెలుపు

చర్లపల్లి డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బొంతు శ్రీదేవి విజయం

నాచారం డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శాంతి సాయిజన్‌ గెలుపు

జగద్గిరిగుట్ట డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జగన్‌ విజయం

హబ్సిగూడలో బీజేపీ అభ్యర్థి కే. చేతన విజయం.

పటాన్‌చెరులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కుమార్‌ యాదవ్‌ గెలుపు

కాప్రా డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి స్వర్ణరాజ్‌ విజయం

ఉప్పల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి రజిత 5వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపు

దూద్‌బౌలిలో ఎంఐఎం అభ్యర్థి ఎండీ సలీమ్‌ విజయం

రంగారెడ్డినగర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయ్‌శేఖర్‌ గౌడ్‌ విజయం

సురారం డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మంత్రి సత్యనారాయణ 2వేల ఓట్ల మెజారిటీతో విజయం

పత్తర్‌గట్టి, పురానాపూల్‌లో ఎంఐఎం అభ్యర్థులు సోహైల్‌ ఖాద్రి, రాజ్‌ మోహన్‌ విజయం

జహనుమా, రామాంసపురా డివిజన్లలో ఎంఐఎం అభ్యర్థులు అబ్దుల్‌ ముక్తదీర్‌, అబ్దుల్‌ ఖాదీర్‌లు విజయం

మల్కాజ్‌గిరి డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి శ్రవణ్ కుమార్ గెలుపు

బాలనగర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆవుల రవీందర్‌ విజయం

చైతన్యపురిలో బీజేపీ అభ్యర్థి నర్సింహగుప్తా విజయం

చింతల్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రషీదా బేగం గెలుపు

దత్తాత్రేయ నగర్‌లో ఎంఐఎం అభ్యర్థి జాకిర్‌ బక్రీ గెలుపు

సనత్ నగర్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి కొలను లక్ష్మి రెడ్డి 2429 ఓట్ల మెజారిటీ విజయం సాధించారు.

సంగారెడ్డి జిల్లా భారతినగర్ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సింధుఆదర్శ్ రెడ్డి 3900 ఓట్ల మెజారిటీతో గెలుపు

కుత్బుల్లాపూర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి పారిజాతం 2025 మెజారిటీ ఓట్లతో గెలుపు

నవాబ్‌సాహెన్‌కుంటలో ఎంఐఎం అభ్యర్థి షరీన్‌ గెలుపు

బార్కాస్‌లో ఎంఐఎం అభ్యర్థి షబానా బేగం గెలుపు

ఆర్సీపురంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పుష్పా నగేశ్‌ యాదవ్‌ 5759 ఓట్ల మెజారిటీతో గెలుపు

బోరబండలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాబా ఫసియుద్దీన్‌ గెలుపు

మంగళ్‌హాట్‌లో బీజేపీ అభ్యర్థి శశికళ గెలుపొందారు.

హైదర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నార్నె శ్రీనివాసరావు విజయం సాధించారు.

అహ్మద్‌నగర్‌లో ఎంఐఎం అభ్యర్థి రఫత్‌ సుల్తానా గెలుపొందారు.

కిషన్‌బాగ్‌లో ఎంఐఎం అభ్యర్థి హుస్సేనీ పాషా గెలుపొందారు.

డబీర్‌పురాలో ఎంఐఎం అభ్యర్థి హుస్సేన్‌ఖాన్‌ విజయం సాధించారు.

ఏఎస్‌ రావు నగర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి శిరీషారెడ్డి విజయం సాధించింది.

యూసఫ్‌గూడలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాజ్‌కుమార్‌ పటేల్‌ గెలుపు సాధించారు.

మెట్టుగూడలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాసూరి సునీత గెలుపు సాధించారు.

మెట్టుగూడలో​ టీఆర్‌ఎస్‌ గెలుపు

ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియలో టీఆర్‌ఎస్‌ పార్టీ పలు డివిజన్లలో ఆధిక్యంలో దూసుకుపోతుంది. మెట్టుగూడ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ తొలి విజయం నమోదు చేసుకుంది. మెట్టుగూడలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాసూరి సునీత విజయం సాధించారు.

గ్రేటర్‌లో తొలిఫలితం వెల్లడి
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. మెహిదీపట్నం డివిజన్‌ పరిధిలో ఎంఐఎం అభ్యర్థి మాజీద్‌ హుస్సేన్‌ గెలుపొందారు. గ్రేటర్‌ పరిధిలోని 150 డివిజన్‌లో అత్యల్పంగా మెహిదీపట్నంలోనే తక్కువగా ఓట్లు పోలయ్యాయి. దీంతో తొలిరౌండ్‌లోనే ఫలితం వెలుడింది. ఇదిలా ఉండగా.. 44 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ పార్టీ అధిక్యంలో కొనసాగుతోంది.

జీఎచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో బీజేపీ అగ్రస్థానంలో ఉండగా.. టీఆర్‌ఎస్‌పార్టీ రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల మేరకు బ్యాలెట్‌ పత్రాల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.

ఉత్తర్వులపై స్పందించిన ఎలక్షన్‌ కమిషన్‌

తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై ఎలక్షన్ కమిషన్ లంచ్ మోషన్ దాఖలు చేయనుంది. ఎలక్షన్ కమిషన్ వ్యవహారంలో కోర్టులు జోక్యం చేసుకోరాదని పేర్కొంది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పునఃపరిశీలించాలని, రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తే స్వీకరించాలని విజ్ఞప్తి చేయనుంది.

స్వస్తిక్ ఉంటేనే ఓటు చెల్లుబాటు: స్పష్టం చేసిన హైకోర్టు

హైదరాబాద్: ఎన్నికల కౌటింగ్‌ జరుగుతున్న క్రమంలో ఎస్‌ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. స్వస్తిక్‌ గుర్తు ఉన్న ఓటును మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో స్వస్తిక్ గుర్తును మాత్రమే పరిగణనలోకి తీసుకోవలని ఎన్నికల సంఘానికి హైకోర్టు అదేశం జారీ చేసింది. స్వస్తిక్ గుర్తు ఉన్న ఓట్లను మాత్రమే లెక్కలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఫలితాలు విడుదల చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. వెంటనే అన్ని కౌంటింగ్ కేంద్రాలకు ఈ సమాచారాన్ని అందించాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సూచిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. బ్యాలెట్‌పై స్వస్తిక్‌ గుర్తుతో పాటు మార్కర్ పెన్‌తో టిక్ చేసినా పరిగణలోకి తీసుకోవాలంటూ గురువారం రాత్రి కౌంటింగ్ కేంద్రాల అధికారులకు ఎస్‌ఈసీ సర్క్యూలర్ జారీ చేసింది. దీనిపై బీజేపీతో పాటు ఇతర ప్రతి పక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశాయి. బీజేపీ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం స్వస్తిక్ గుర్తు ఉన్న ఓట్లను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది.

 

ముషీరాబాద్ సర్కిల్‌లో కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్..

జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముషీరాబాద్ సర్కిల్‌లో కౌంటింగ్ ఏర్పాట్లను హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. కౌంటింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. నగరంలో విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని సీపీ స్పష్టం చేశారు. 48 గంటల పాటు ఈ నిషేధం ఉంటుందన్నారు. ఆ తర్వాత విజయోవత్స ర్యాలీ నిర్వహించుకునేందుకు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే అనుమతి ఇస్తామని అంజనీ కుమార్ తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 15 చోట్ల కౌంటింగ్ ప్రశాంతంగా సాగుతోందని సీపీ పేర్కొన్నారు.

 

పోస్టల్‌ బ్యాలెట్లలో బీజేపీకి ఆధిక్యం

 రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయి. మొదట లెక్కించిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో అనుహ్య రీతిలో బీజేపీ ఓట్లను సాధించింది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. పోస్టల్‌ ఓట్లలో బీజేపీ ముందంజలో ఉంది. మెజార్టీ డివిజన్లలో టీఆర్‌ఎస్‌పై పూర్తిస్థాయిలో బీజేపీ ఆదిపత్యం ప్రదర్శించింది. పోస్టల్‌ బ్యాలెట్‌లో మొదటి స్థానంలో బీజేపీ ఉండగా.. రెండో స్థానంలో టీఆర్‌ఎస్‌ ఉంది. గ్రేటర్‌ పరిధిలోని 150 డివిజన్లలో కేవలం 1926 పోస్టల్‌ ఓట్లు పోలయ్యాయి. ఎవరూ ఊహించని విధంగా బీజేపీ అత్యధిక ఓట్లను కైవసం చేసుకుంది. మరోవైపు బ్యాలెట్‌ పత్రాల లెక్కింపులో బీజేపీ అనూహ్య రీతిలో పుంజుకుంది. ఇప్పటి వరకు 82 డివిజన్‌లో బీజేపీ ముందంజలో ఉండగా.. 29 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు లీడింగ్‌లో కొనసాగుతున్నారు. టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానాల్లో కామలదళం జోరుమీద ఉంది. మరికాసేపట్లో తొలి ఫలితం విడుదల కానుంది.

తొలి ఫలితం..

11 గంటల తర్వాత మొదటి రౌండ్‌ ఫలితం వచ్చే అవకాశం ఉంది. సాయంత్రానికి పూర్తిస్థాయి ఫలితాలు వెలువడతాయని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ 1,926 పోస్టల్‌ బ్యాలెట్లు వచ్చాయి. ఒక్కో రౌండ్‌ ఓట్ల లెక్కింపునకు గంట నుంచి గంటన్నర సమయం పట్టనుంది. లెక్కింపులో 8,152 మంది సిబ్బంది పాల్గొన్నారు. సీసీటీవీ కెమెరాలతో లెక్కింపును రికార్డు చేయనున్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద కూడా కరోనా కట్టడి చర్యలు తీసుకున్నారు.

డివిజన్ల వారీగా పోస్టల్‌ ఓట్లు..

హిమాయత్‌నగర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): టీఆర్‌ఎస్‌ 17, బీజేపీ 10, కాంగ్రెస్‌
జంగంమెట్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): ఎంఐఎం 7, బీజేపీ 6
ఉప్పుగూడ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 5, ఎంఐఎం 4
చంద్రయాణగుట్ట డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): ఎంఐఎం 1, టీఆర్‌ఎస్‌ 1
కంచన్‌బాగ్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 2, ఎంఐఎం 1
రియాసత్‌నగర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): ఎంఐఎం 3, బీజేపీ 2, టీఆర్‌ఎస్‌ 1
లలితాబాగ్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 3, టీఆర్‌ఎస్‌ 1
నేరేడ్‌మెట్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): టీఆర్‌ఎస్‌ 4, బీజేపీ 3, నోటా 1
వినాయక్‌నగర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): టీఆర్‌ఎస్‌ 3, బీజేపీ 2, కాంగ్రెస్‌ 1
బన్సీలాల్‌పేట్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 11, టీఆర్‌ఎస్‌ 2
రాంగోపాల్‌పేట డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): టీఆర్‌ఎస్‌ 2
బేగంపేట్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 11, టీఆర్‌ఎస్‌ 4, కాంగ్రెస్‌ 2
మోండామార్కెట్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 9, టీఆర్‌ఎస్‌ 1
ఈస్‌ ఆనంద్‌బాగ్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): టీఆర్‌ఎస్‌ 3, బీజేపీ 3, కాంగ్రెస్‌ 1
ఫలక్‌నుమా డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): ఎంఐఎం 2
నవాబ్‌సాహెబ్‌కుంట డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): ఎంఐఎం 3
దూద్‌బౌలి డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): ఎంఐఎం 3, టీఆర్‌ఎస్‌ 1
రణ్‌మస్తపురా డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): ఎంఐఎం 4
కిషన్‌బాగ్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): ఎంఐఎం 3, టీఆర్‌ఎస్‌ 1, బీజేపీ 2
సైదాబాద్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 30, టీఆర్‌ఎస్‌ 6
ముసారాంబాగ్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): టీఆర్‌ఎస్‌ 4, బీజేపీ 4, కాంగ్రెస్‌ 1
ఓల్డ్‌ మలక్‌పేట్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): టీఆర్‌ఎస్‌ 1
అజంపురా డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): ఎంఐఎం 2, ఇండిపెండెంట్‌ 1
చామిని డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 2
అడిక్‌మెట్ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 4, టీఆర్‌ఎస్‌ 3, కాంగ్రెస్ 1
రామ్‌నగర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 4, టీఆర్‌ఎస్‌ 5
మల్కాజ్‌గిరి డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 5
బేగంబజార్ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 6, టీఆర్‌ఎస్‌ 1
నాగోల్ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 13, టీఆర్‌ఎస్‌ 12, కాంగ్రెస్‌ 1
బేగంబజార్ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 6, టీఆర్‌ఎస్‌ 1
హయత్‌నగర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 8, టీఆర్‌ఎస్‌ 1, కాంగ్రెస్‌ 1, టీడీపీ 1
బోయిన్‌పల్లి డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్): టీఆర్‌ఎస్‌ 8, బీజేపీ 7
హైదర్‌నగర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 3, టీఆర్ఎస్‌ 1, టీడీపీ 1
భారతీనగర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 4, టీఆర్‌ఎస్‌ 3
గచ్చిబౌలి డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): టీఆర్‌ఎస్‌ 1, చెల్లనివి 2
వనస్థలిపురం డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 5, టీఆర్‌ఎస్‌ 2, నోటా 1
చంపాపేట్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 5, టీఆర్‌ఎస్‌ 2, కాంగ్రెస్‌ 1
సరూర్‌నగర్‌ డివిజన్‌లో ఇంకా ప్రారంభంకాని ఓట్ల లెక్కింపు
శేరిలింగంపల్లి డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): టీఆర్‌ఎస్‌ 5, బీజేపీ 3
లింగోజీగూడ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 5, కాంగ్రెస్‌ 3, టీఆర్‌ఎస్‌ 1
హస్తినాపురం డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 2
పటాన్‌చెరు డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): టీఆర్‌ఎస్‌ 1, కాంగ్రెస్‌ 1
కూకట్‌పల్లి డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 24, టీఆర్‌ఎస్‌ 21, టీడీపీ 2, నోటా 2
సూరారం డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): టీఆర్‌ఎస్‌ 1, బీజేపీ 1, చెల్లనివి 2
గాజులరామారం డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 3, టీఆర్‌ఎస్‌ 2, కాంగ్రెస్‌ 1
అల్వాల్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 12, టీఆర్‌ఎస్‌ 6, నోటా1, చెల్లనివి 23
జీడిమెట్ల డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 6, టీఆర్‌ఎస్‌ 4, చెల్లనివి 1
సుభాష్‌నగర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): టీఆర్‌ఎస్‌ 9, బీజేపీ 3
కొండాపూర్ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 5
అల్లాపూర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 3
మూసాపేట్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 3, టీఆర్‌ఎస్‌ 2, టీడీపీ 1
ఫతేనగర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): టీఆర్‌ఎస్‌ 1
కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 5, టీఆర్‌ఎస్‌ 2
బాలాజీనగర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 4, టీఆర్‌ఎస్‌ 3
మన్సూరాబాద్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 8, టీఆర్‌ఎస్‌ 5
కవాడీగూడ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 10, టీఆర్‌ఎస్‌ 1, టీడీపీ 1
నాగోల్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 13, టీఆర్ఎస్‌ 12, కాంగ్రెస్‌ 1
కుత్బుల్లాపూర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): టీఆర్‌ఎస్‌ 5, బీజేపీ 2
మాదాపూర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 2, టీఆర్‌ఎస్‌ 1
మియాపూర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): టీఆర్‌ఎస్‌ 1, కాంగ్రెస్‌ 1
హఫీజ్‌పేట డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 4
చందానగర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 2, టీఆర్‌ఎస్‌ 1
మూసాపేట డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 15, టీఆర్‌ఎస్‌ 8, టీడీపీ 1
బాలానగర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): టీఆర్‌ఎస్‌ 5, బీజేపీ 2
జగద్గిరిగుట్ట డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 1, టీఆర్‌ఎస్‌ 1
కుత్బుల్లాపూర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): టీఆర్‌ఎస్‌ 20, బీజేపీ 14
మల్కాజ్‌గిరి డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 5, టీఆర్ఎస్‌ 1
బీఎన్‌రెడ్డి డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): టీఆర్‌ఎస్‌ 10, బీజేపీ
గాంధీనగర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 7, టీఆర్‌ఎస్‌ 2, నోటా 1
భోలక్‌పూర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 2, టీఆర్‌ఎస్‌ 1

Leave A Reply

Your email address will not be published.