సింగర్‌ సునీతకు రెండో పెళ్లి..?

హైదరాబాద్‌: తెలుగు ఇండస్ట్రీలో సింగర్స్‌కు గుర్తింపు ఉంటుంది కానీ స్టార్స్ మాదిరి అయితే ట్రీట్ చేయరు. కానీ అలా ట్రీట్ చేసే అతి తక్కువ మంది సింగర్స్‌లో సునీత కూడా ఉంటుంది. ఈమె కేవలం గాయకురాలు మాత్రమే కాదు.. యాంకర్, హోస్ట్, సీనియర్ మోస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. ఎన్నో వందల సినిమాలకు ఈమె డబ్బింగ్ చెప్పడంతో పాటు వేల పాటలు పాడింది. ఇప్పటికీ పాడుతూనే ఉంది.
అయితే సింగర్‌ సునీత రెండో పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్‌మీడియాలో వార్తలస్తున్నాయి. డిజిటల్‌ రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న ఓ బిజినెస్‌ మ్యాన్‌ను ఆమె పెళ్లి చేసుకోబోతోన్నారని టాక్‌. టాలీవుడ్‌ క్రేజీ సింగర్‌గానూ, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గానూ ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మొదటి భర్తనుండి విడాకులు తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తను ఒంటరి జీవితాన్ని గడుపుతున్నానని, ఈ విషయంలో తనపై వస్తున్న పుకార్లను పట్టించుకోనని వివరించారు. అయితే.. తాజాగా సింగర్‌ సునీత రెండో పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్‌మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లిచేసుకోబోయే వ్యక్తికి కూడా ఇది రెండో పెళ్లేనట. ఈ వార్తపై సునీత ఇంకా స్పందించలేదు.

Leave A Reply

Your email address will not be published.