సీజేఐ ఎన్వీ రమణకు ఘన స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై, సిఎం కెసిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ)గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి విచ్చేసిన జస్టిస్ ఎన్వీ రమణకు శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘన స్వాగతం లభించింది. హైకోర్టు సిజె జస్టిస్ హిమా కోహ్లీ, మంత్రులు కెటిఆర్, పువ్వాడ అజయ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి, సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్‌రెడ్డి, తదితరులు స్వాగతంపలికిన వారిలో ఉన్నారు.

శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాజ్‌భవన్ చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలికారు. అనంతరం ఎన్వీ రమణ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. మూడు రోజులపాటు రాజ్‌భవన్ అతిథిగృహంలో బస చేయనున్నారు.