సూనూను ఎమ్మెల్యే టికెట్ అడిగిన నెటిజన్..!
ఇప్పుడు సోనూ సూద్‌కు దేశం మొత్త అభిమానులు ఏర్పడ్డారు. వెండితెరమీద మీద విలన్ పాత్రలు పోషించినా.. కానీ రియల్ లైఫ్‌లో ఎందరికో ఆదర్శంగా నిలిచి రియల్ హీరో అనిపించుకున్నాడు. సోనుకు దేశంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా.. ఆయనకు సోషల్ మీడియా ద్వారా తమ సమస్యలను సోనూకు విన్నవించుకుని సహాయం అడుగుతున్నారు. ఈ క్రమంలో కొందరు ఫన్నీ ట్వీట్లు కూడా చేస్తున్నారు. తాజాగా ఓ నెటిజన్ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించమని సోనూను ఓకరు కోరాడు. త్వరలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేయడానికి తనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించమని అడిగాడు. దీనికి స్పందించిన సోనూ అంతే ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. `బస్సు, రైలు, విమానం టికెట్లు తప్ప వేరే టికెట్లు ఇప్పించడం తెలియదు బ్రదర్` అని రిప్లై ఇచ్చాడు. సోనూ ఇచ్చిన రిప్లైపై అభిమానులు, నెటిజన్లు షేర్ చేస్తూ ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేస్తున్నారు.
बस, ट्रेन और प्लेन की टिकट के इलावा मुझे कोई टिकट दिलवाना नहीं आता मेरे भाई। 😂🙏 https://t.co/qULDxegoLW
— sonu sood (@SonuSood) September 16, 2020