సూప‌ర్‌స్టార్‌కు క్రిస్మ‌స్ గిఫ్ట్ పంపిన ప‌వ‌ర్‌స్టార్‌

డిసెంబ‌ర్ 25న క్రిస్మ‌స్ సంద‌ర్భంగా ఒక‌రికి ఒక‌రు గిఫ్ట్స్ ఇచ్చి త‌మ ప్రేమ‌ను తెలియ‌జేసుకుంటున్నారు. తాజాగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అన్నా లెజినోవా దంప‌తులు టాలీవుడ్ సూపర్ స్టార్ మ‌హేష్ ఫ్యామిలీకి క్రిస్మ‌స్ గిఫ్ట్ పంపారు. ఈ విష‌యాన్ని న‌మ్ర‌త శిరోద్క‌ర్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియ‌జేశారు. అంతేకాక ప‌వ‌న్ దంప‌తుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసింది న‌మ్ర‌త‌.

మ‌హేష్ ఫ్యామిలీకి క్రిస్మ‌స్ గిఫ్ట్ పంప‌డంతో ఈ విష‌యం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇద్ద‌రు టాప్ హీరోస్ మ‌ధ్య నెల‌కొన్న ఈ స్నేహాన్ని చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.