సెక్ర‌టేరియ‌ట్ నిర్మాణ ప‌నులు ప‌రిశీలించిన కెసిఆర్‌

హైద‌రాబాద్: రూ.617 కోట్లతో తెలంగాణ రాష్ట్రంలో నూతన సచివాలయ సముదాయం నిర్మాణం అవుతున్న విష‌యం తెలిసిందే. కాగా కొత్త సెక్ర‌టేరియ‌ట్ నిర్మాణ ప‌నుల‌ను తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు ప‌రిశీలించారు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం మంత్రులు వేముల ప్ర‌శాంత్‌రెడ్డి, మ‌హ‌మూద్ అలీ, త‌ల‌సానిశ్రీ‌నివాస్ యాద‌వ్ కొప్పుల ఈశ్వ‌ర్‌, సిఎస్ సోమేశ్ కుమార్‌, ఉన్న‌తాధికారులతో క‌లిసి నిర్మాణ ప‌నుల‌ను కెసిఆర్ ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా నిర్మాణ ప‌నుల‌ను గురించి సిబ్బందిని అడిగి కెసిఆర్ వివ‌రాలు తెలుసుకున్నారు. ప‌నుల్లో నాణ్య‌త పాటించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. స‌చివాల‌య మెయిన్ గేట్‌తో పాటు ఇత‌ర గేట్లు అమ‌ర్చే ప్రాంతాలు, భ‌వ‌న స‌ముదాయం నిర్మించే ప్రాంతం, వాటి డిజైన్ల‌ను ముఖ్య‌మంత్రి ప‌రిశీలించారు. నిర్మాణ ప‌నుల్లో వేగం పెంచాల‌ని ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి అధికారుల‌ను ఆదేశించారు.

 

 

 

Leave A Reply

Your email address will not be published.