సెప్టెంబర్‌ మూడో వారంలో పార్లమెంట్?

సమావేశాల నిర్వ‌హ‌ణ‌కు ప్రత్యేక ఏర్పాట్లు

సెప్టెంబర్‌ మూడో వారంలో పార్లమెంట్?

సమావేశాల నిర్వ‌హ‌ణ‌కు ప్రత్యేక ఏర్పాట్లు

న్యూఢిల్లీ: సెప్టెంబర్‌ మూడో వారంలో పార్లమెంట్ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాలకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజ్యసభ సచివాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వేగంగా విజృంభిస్తున్న నేపధ్యంలో ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా రాజ్యసభ స‌భ్యుల‌కు లోక్‌సభలో సీటింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్ల‌న్ని ఈ నెల మూడోవారంలో పూర్తి చేయాల‌ని రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు ఆదేశాలు ఇచ్చారు.
ప‌్ర‌ప‌పంచ‌దేశాల‌తో పాటు క‌రోనా భార‌త్‌ను కూడా క‌ల‌వ‌ర పెడుతోంది. దేశంలో వైర‌స్‌తో మ‌ర‌ణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగి పోతోంది. ఈ నేపధ్యంలో భౌతిక​ దూరం పాటిస్తూ సీటింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రేడియేషన్ పద్ధతి ద్వారా ఆల్ట్రా వైలెట్ కిరణాలను ప్రసరింపచేసి వైరస్‌ను హతమార్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

కాగా వ‌చ్చేనెల‌ మూడో వారంలో పార్లమెంట్ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం లోక్‌సభ, సాయంత్రం రాజ్యసభ సమావేశాలు జరగనున్నాయి. ప్రతి రోజు నాలుగు గంటల పాటు సమావేశాలను నిర్వహించనున్నారు. దాదాపు రెండు వారాల పాటు సమావేశాలు కోనసాగే అవకాశం ఉంది. అయితే రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రతి ఆరు నెలలకు తప్పనిసరిగా పార్లమెంట్ సమావేశాలు జరగాలని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే కరోనా విజృంభిస్తున్న తరుణంలో సమావేశాలను నియమాలకు అనుగుణంగా నిర్వహించనున్నారు. మరోవైపు పార్లమెంట్‌ సమావేశాలకు సంబంధించిన స్పష్టమైన షెడ్యుల్‌ ఇంకా వెల్లడి కాలేదు. కానీ ప్ర‌త్యేక ఏర్ప‌ట్లు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.