సోలాపూర్‌లో రోడ్డుప్రమాదం.. చిన్నారి సహా నలుగురు దుర్మరణం
సోలాపూర్: మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రక్కును కారు ఢీకొట్టిన ఘటనలో చిన్నారి సహా నలుగురు మృత్యువాతపడ్డారు. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో జిల్లాలోని సంగోలా-పంధర్పూర్ మార్గంలో కాసేగావ్ గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతులను కొల్హాపూర్ జిల్లాలోని చంద్గడ్ తహసీల్‌కు చెందిన వారిగా గుర్తించారు. మృతులు పంధర్పూర్లో దైవ దర్శనం కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగిందని ఎస్ఐ కిరణ్ అవ్చర్ తెలిపారు. కారును డ్రైవర్ అతివేగంతో వాహనం నడపడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఢీకొట్టినట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.