సౌరవ్‌ గంగూలీకి గుండెపోటు.. హెల్త్‌ బులిటెన్‌ రిలీజ్‌..

కోల్‌కతా: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శనివారం గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను ఇంటికి సమీపంలోని వుడ్‌ల్యాండ్‌ దవాఖానకు తరలించారు. శనివారం ఉదయం వేళ ఎప్పటిమాదిరిగానే తన ఇంట్లోని జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా అసౌకర్యంగా ఫీలయ్యాడు. విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపాడు. దాంతో ఆయనను ఇంటికి సమీపంలోని వుడ్‌ల్యాండ్‌ దవాఖానకు తరలించారు. అక్కడ పరీక్షించిన డార్టర్‌ సరోజ్‌ మొండల్‌తో కూడిన ముగ్గురు సభ్యుల బృందం.. గుండెకు యాంజియోప్లాస్టీ చేయాల్సి ఉంటుందని చెప్పినట్లు తెలిసింది. యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత భారత మాజీ కెప్టెన్‌ను శనివారం డిశ్చార్జ్ చేస్తారని బోరియా మజుందార్ ధ్రువీకరించారు.

అయితే.. తాజాగా ఆయన ఆరోగ్యంపై బులిటెన్‌ను ఉడ్‌ల్యాండ్స్ ఆస్పత్రి వైద్యులు రిలీజ్‌ చేశారు. “సౌరవ్ గంగూలీ యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. ఆయన ఆరోగ్యం ఇప్పుడు స్థిరంగా ఉంది. అతన్ని మరో 24 గంటలు పర్యవేక్షిస్తాం. గంగూలీ పూర్తిగా స్పృహలో ఉన్నాడు. ఆయన గుండెలో రెండు హోల్స్‌ ఉన్నాయి, దీనికి ఆయన చికిత్స పొందుతున్నారు” అని వైద్యులు బులిటెన్‌లో పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.