స్వామి వారి రథం దగ్ధం..

అత‌ర్వేది: తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రథం రగ్ధం అయింది. శనివారం అర్ధరాత్రి సమయంలో ఆలయ ప్రాంగణంలోని షెడ్డులో భద్రపరిచిన రథానికి మంటలు అంటుకున్నాయి. అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక ఎవరైనా ఆకతాయిల పనా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అంతర్వేదిలో లక్ష్మీ నరసింహ స్వామి వారి కల్యాణోత్సవం ఏటా ఘనంగా నిర్వహిస్తారు. స్వామి వారిని ఊరేగించడం కోసం 40 అడుగుల ఎత్తు ఉన్న ఈ రథాన్ని 62 ఏళ్ల క్రితం టేకు కలపతో తయారు చేయించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా విద్రోహ చర్య అన్న అంశంపై పోలీసులు విచారణ చేపట్టారు.
మంత్రి వెల్లంపల్లి దిగ్భ్రాంతి
అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధమైన ఘటనపై దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఘటన గురించి తెలిసిన వెంటనే ఆయన.. దేవ‌దాయ క‌మిష‌న‌ర్ పి.అర్జున‌రావు‌, జిల్లా ఎస్పీతో ఫోన్ మాట్లాడారు. స‌హ‌య‌క చ‌ర్యులు చేప‌డుతున్న దేవ‌దాయ, పోలీస్‌, పైరింజ‌న్‌, రెవెన్యూ అధికారుల‌తో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. ఘటనపై లోతుగా దర్యాప్తు జరపాల్సిందిగా ఆదేశిస్తూ.. దేవ‌దాయ శాఖ అద‌న‌పు క‌మిష‌న‌ర్ రామ‌చంద్ర‌మోహ‌న్‌ను విచార‌ణ అధికారిగా నియ‌మించారు. బాధ్యులను గుర్తించి క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. అదే విధంగా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం పున: నిర్మాణానికి చ‌ర్యులు చేప‌ట్టాల‌ని దేవ‌దాయ క‌మిష‌న‌ర్‌కు మంత్రి సూచించారు.

Leave A Reply

Your email address will not be published.