హిట్‌మ్యాన్‌కు అత్యున్నత క్రీడా పురస్కారం

న్యూఢిల్లీ: క్రీడల్లో అత్యున్నతమైన అవార్డు రాజీవ్ ఖేల్‌రత్నకు అర్హత సాధించిన వారి జాబితాను కేంద్రం అధికారికంగా ప్రకటించింది. క్రికెటర్ రోహిత్ శర్మ, రెజ్లర్ వినేష్ ఫోగట్, టెబుల్ టెన్నిస్ ఛాంపియన్ మనికా బాత్రా, 2016 పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ మరియప్పన్ తంగవేలు, హాకీ క్రీడాకారిణి రాణి రాంపాల్.. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును అందుకోనున్నారు. ఈ ఏడాదిగాను ఖేల్‌రత్న అవార్డుకు నామినేట్‌ అయిన రోహిత్‌ శర్మ ఊహించినట్లుగానే ఆ అత్యున్నత క్రీడా పురస్కారాన్ని అందుకోనున్నాడు. ఫలితంగా సచిన్‌ టెండూల్కర్‌, ఎంఎస్‌ ధోని, విరాట్‌ కోహ్లిల సరసన చేరాడు. అంతకుముందు ఈ ముగ్గురు మాత్రమే ఖేల్‌రత్న దక్కించుకున్న భారత క్రికెటర్లు. క్రీడా మంత్రిత్వ శాఖ ఈరోజు(శుక్రవారం) ప్రకటించిన స్పోర్ట్స్‌ అవార్డుల్లో రోహిత్‌తో పాటు మరో నలుగురు ఖేల్‌రత్న అవార్డుకు ఎంపికయ్యారు. రోహిత్‌తో పాటు స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌, టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) సంచలనం మనికా బాత్రా, రియో (2016) పారా ఒలింపిక్‌ స్వర్ణ పతక విజేత మరియప్పన్‌ తంగవేలు, మహిళల హాకీ కెప్టెన్‌ రాణి రాంపాల్‌ ఖేల్‌రత్న అందుకోనున్నారు.
రిటైర్డ్‌ జస్టిస్‌ ముకుందమ్ శర్మ నేతృత్వంలోని మాజీ డాషింగ్ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌, హాకీ మాజీ కెప్టెన్‌ సర్దార్‌ సింగ్‌లతో కూడిన 12 మంది సభ్యుల కమిటీ సిఫారసు చేసిన క్రీడా పురస్కారాల జాబితాకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఇక 27 మందిని అర్జున అవార్డుకు ఎంపిక చేసింది.

Leave A Reply

Your email address will not be published.