హెల్మెట్‌ను తప్పనిసరి చేయండి

ఐసిసికి స‌చిన్ సూచ‌న‌

న్యూఢిల్లీ: క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌ హెల్మెట్‌ను త‌ప్ప‌కుండా పెట్టుకోనేలా చూడాల‌ని అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ)కు భారత దిగ్గజం సచిన్‌ టెం డూల్కర్‌ సూచించాడు. ఇటీవల ఐపీఎల్‌లో పంజాబ్‌ ఫీల్డర్‌ నికోలస్‌ పూరన్‌ విసిరిన బంతి హైదరాబాద్‌ ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ తలకు బలంగా తగిలిన వీడియోను సచిన్‌ ట్విటర్‌లో ఐసీసీకి షేర్‌ చేశాడు. గత నెల 24న జరిగిన ఈ మ్యాచ్‌లో స్ట్రయికర్‌ శంకర్‌ సింగిల్‌ కోసం పరిగెత్తుతుండగా నికోలస్‌ బంతి విసరడంతో హెల్మెట్‌ గ్రిల్‌కు బలంగా తాకడంతో మైదానంలో కుప్పకూలిపోయాడు. అతనికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ‘క్రికెట్‌లో వేగం పెరిగింది. ఇటీవల ఐపీఎల్‌లో జరిగిన సంఘటన ప్రమాద తీవ్రతను తెలుపుతోంది. కాబట్టి ప్రొఫెషనల్‌ స్థాయిలో బౌలర్‌ పేసర్‌ లేదా స్పిన్నర్‌ ఎవరైనా బ్యాట్స్‌మెన్‌ హెల్మెట్‌ ధరించడం తప్పనిసరి చేయాలి. ఈ మేరకు ఐసీసీ నిబంధన తేవాలి’ అని సచిన్‌ ట్వీట్‌ చేశాడు.

 

 

Leave A Reply

Your email address will not be published.