హైదరాబాద్ మేయర్ గా విజయలక్ష్మి బాధ్యతలు..

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు.
ఈ కార్యక్రమానికి తలసాని, కేకే, దానం నాగేందర్ హాజరయ్యారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చార్జీ తీసుకున్నాక తండ్రి కేకే ఆశీస్సులు తీసుకున్నారు. మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన విజయలక్ష్మికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. కాసేపట్లో గన్ పార్క్ కు వెళ్లనున్న మేయర్ అక్కడ అమరవీరుల స్థూపం వద్ద వారికి నివాళులు అర్పించానున్నారు. ఫిబ్రవరి 11న నగర మేయర్ ఎన్నికల్లో టిఆర్ ఎస్ తరఫున కార్పొరేటర్‌గా గెలుపొందిన గద్వాల విజయలక్ష్మి మేయర్‌గా, డిప్యూటీ మేయర్‌గా శ్రీలత రెడ్డి ఎన్నికయ్యారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ఏడో అంతస్తులో చాంబర్‌ను సిద్ధం చేశారు. విజయలక్ష్మీ బంజారాహిల్స్ నుంచి కార్పొరేటర్ గా విజయం సాధించిన విషయం తెలిసిందే.