హల్దీ, గజ్వేల్ కాల్వలోకి కాళేశ్వర జలాలు విడుదల చేసిన కెసిఆర్
సంగారెడ్డి : కాళేశ్వర ప్రాజెక్టు ప్రస్థానంలో మంగళవారం మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. అవుసులోనిపల్లి వద్ద ముఖ్యమంత్రి కెసిఆర్ నీటిని విడుదల చేయగా కాళేవ్వర గంగ హల్దీ వాగులోకి పరవళ్లు తొక్కుతోంది. ఎండాకాంలోనూ సాగునీటిని అందించేలా సంగారెడ్డి కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. దీంతో సిద్దిపేట, మెదక్ జిల్లాల పరిధిలోని చెరువులు జలకళను సంతరించుకోనున్నాయి. తక్షణం 14 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.
కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కాల్వలో పారుతున్న కాళేశ్వర జలాలను.. వర్గల్ మండలం అవుసులపల్లి గ్రామంలో సంగారెడ్డి కెనాల్ నుంచి హల్దీ కాల్వలోకి కాళేశ్వర జలాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
హల్దీ కాల్వలోకి 1600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అనంతరం మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో కాళేశ్వర జలాలను గజ్వేల్ కాల్వలోకి విడుదల చేశారు. నీటి విడుదల సందర్భంగా గోదావరి జలాలకు సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు.

ఈ నీళ్లు అవుసులోనిపల్లి నుంచి మొదట వర్గల్‌లోని బంధం చెరువుకు కాళేశ్వరం నీళ్లు చేరుకుంటాయి. అక్కడి నుంచి అదే గ్రామంలోని పెద్ద చురువుకు, శౄకారంలోని ధర్మాయ చెరువు, అనంతరం అంబర్‌పేటలోని ఖాన్ చెరువు వరకు గొలుసుకట్టు ద్వారా నీరు ప్రవహిస్తుంది. ఖాన్ చెరువునుంచి హల్దీ వాగులోకి, హల్దీ నుంచి మంజీరా నదిలోకి అక్కడి నుంచి నిజాం సాగర్‌కు కాళేశ్వరం జలాలు చేరతాయి.