‘‌వ‌కీల్ సాబ్’‌ సెట్ లో‌ నివేధాథామ‌స్‌

హైదరాబాద్‌ : టాలీవుడ్ న‌టుడు పవన్‌కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంతో తెర‌కెక్కుతున్న చిత్రం `పింక్‌`లో నివేదా థామస్, లావణ్య త్రిపాటి, అనన్య నాగల్ల, అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో నిలిచిపోయిన సినిమా షూటింగ్ మ‌ళ్లీ షురూ అయింది. ఈ మూవీ చివ‌రి షెడ్యూల్ షూట్ లో నివేదా థామ‌స్ జాయిన్ అయింది.

సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. కరోనా వల్ల షూటింగ్‌ ఆగిపోయి.. ఇటీవలే షూటింగ్‌ పునః ప్రారంభమయ్యింది. అయితే, షూటింగ్‌లో పవన్‌ ఇంకా జాయిన్‌ అవ్వలేదట! పవన్‌కళ్యాణ్‌ లేని సన్నివేశాల్ని దర్శకుడు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే హీరోయిన్‌ నివేథా థామస్‌ కూడా షూటింగ్‌లో పాల్గొంటోందని, ఆమెకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఈ విష‌యాన్ని ఫొటో ద్వారా తెలియ‌జేస్తూ..మ‌ళ్లీ షూటింగ్ కు తిరిగి రావ‌డం ఆనందంగా ఉంద‌ని నివేదా ట్వీట్ చేసింది.

 

పవన్‌ షూటింగ్‌లో ఎప్పుడు జాయిన్‌ అవుతారనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. అతి త్వరలోనే ఆయన జాయిన్‌ అవుతాడని యూనిట్‌ సభ్యులు వెయిట్‌ చేస్తున్నారట. పవన్‌ ఈ చిత్రానికి మూడువారాల పాటు డేట్లు ఇచ్చాడట. ఆ మూడువారాల్లో పూర్తిచేసి సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. సినిమాలోని ఓ కీలక పాత్రలో శృతి హాసన్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని బోని కపూర్, దిల్ రాజు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Leave A Reply

Your email address will not be published.