కూతురు మృతదేహంతో 10 కి.మీ. న‌డుచుకుంటూ వెళ్లిన తండ్రి

రాయ్‌పూర్ (CLiC2NEWS): ఇది హృద‌య వీదార‌క ఘ‌ట‌న‌.. శ‌వాల‌ను త‌ర‌లించే వాహ‌నం అందుబాటులో లేక‌పోవ‌డంతో.. క‌న్న తండ్రే త‌న కూత‌రు శవాన్ని దాదాపు 10 కిలోమీట‌ర్ల మేర భూజాల‌పై మోసుకెళ్లాడు.. ఈ ఘ‌ట‌న ఛ‌త్తీస్‌గ‌ఢ్ లోని సుర్గుజా జిల్లాలో చోటుచేసుకుంది. ఈ విడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో ఈ ఘ‌ట‌పై రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విచార‌ణ‌కు ఆదేశించారు.

వివ‌రాల్లోకి వెళ్తే..

అమ్‌దాలా విలేజ్‌కు చెందిన ఈశ్వ‌ర్ దాస్‌కు సురేఖ (7) అనే కూతురు ఉంది. సురేఖ గ‌త వారం రోజులుగా తీవ్ర జ్వ‌రం తో బాధ‌ప‌డుతోంది. దీంతో చికిత్స కోసం ల‌ఖ‌న్‌పూర్ క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్‌కు శుక్ర‌వారం తీసుకొచ్చారు. అప్ప‌టికే చిన్నారి ప‌రిస్థితి విష‌మించింది. చిన్నారి ఆక్సిజ‌న్ లెవల్స్ 60కి ప‌డిపోయాయి. డాక్టర్లు చికిత్స అందించిన్ప‌టికీ చిన్నారి ప్రాణాలు కాపాడ‌లేక‌పోయారు. ఆ చిన్నారి వైద్యం పొందుతూ నిన్న ఉద‌యం మృతిచెందింది.

అయితే ఆ చిన్నారి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ద‌వాఖానాలో అంబులెన్స్ అందుబాటులో లేదు. దీంతో తండ్రి ఈశ్వర్ దాస్ కూతురు మృత‌దేహాన్ని భుజాన వేసుకుని 10 కిలోమీట‌ర్లు న‌డిచి గ్రామానికి వెళ్లాడు. ఈశ్వ‌ర్ వెళ్తున్న క్ర‌మంలో కొంద‌రు తీసిన ఫొటోలు, విడియోలు వైర‌ల్ కావ‌డంతో అక్క‌డి స‌ర్కార్ పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఆ విష‌యం రాష్ట్ర ఆరోగ్య మంత్రి సింగ్ దియోకు తెలియ‌డంతో తీవ్రంగా స్పందించి విచార‌ణ‌కు ఆదేశించారు.

విడియోలు, ఫొటోలు చూసి చ‌లించిపోయాన‌ని మంత్రి పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌కు బాధ్యులైన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించిన‌ట్లు మంత్రి తెలిపారు.

 

Leave A Reply

Your email address will not be published.