బాణాసంచా కార్మాగారంలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి

చెన్నై (CLiC2NEWS): బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 10 మంది కార్మికులు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తమిళనాడులోని అరియలూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఫైర్ వర్క్స్ తయారు చేస్తున్న కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు లోపలే చిక్కుకుపోయారు. దీంతో 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్త అరియలూరు ప్రభుత్వ కళాశాల అస్పత్రికి తరలించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 3లక్షల పరిహారం ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 1 లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున సాయం అందజేయనున్నట్లు ప్రకటించారు.