రాష్ట్రంలో తాగునీటి స‌ర‌ఫరా.. 10 మంది ఐఎఎస్‌ల నియామ‌కం

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో తాగునీటి స‌ర‌ఫ‌రా ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ప్ర‌భుత్వం 10 మంది ప్ర‌త్యేక అధికారుల‌ను నియ‌మించింది. 33 జిల్లాల్లో తాగునీటి స‌ర‌ఫ‌రా సజావుగా సాగేలీ చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించింది. జులై చివ‌రి వ‌ర‌కు ఈ ప్ర‌త్యేక అధికారులు సెల‌వు పెట్ట‌కూడ‌ద‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. తెలంగాణ వ్యాప్తంగా గ‌త ఆరు నెల‌ల్లో తీవ్ర వ‌ర్షాభావ ప‌రిస్థితుల‌తో పాటు ప్ర‌స్తుత ఎండ‌ల తీవ్ర‌త కార‌ణంగా జ‌లాశ‌యాలు, భూగ‌ర్భ జ‌లాలు అడుగంటున్నాయ‌ని, ప్ర‌ధాన జలాశ‌యాల్లో నీటి మ‌ట్టాలు తాగు అవ‌స‌రాల‌కు మిన‌మా సాగుకు ఎంత‌మాత్రం నీటిని ఇవ్వ‌లేని ప‌రిస్తితికి చేరాయి. భూగ‌ర్భ జ‌ట‌మ‌ట్టాలు సైతం గ‌త ప‌దేళ్ల‌లో ఎప్పుడూ లేని స్థాయిలో పడిపోయాయ‌ని ..ఈ నేప‌థ్యంలో నీటి వృథాను అరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.