తిరుపతి: స్విమ్స్‌లో 100 నర్సింగ్ అప్రెంటిస్ ఖాళీలు
SVIMS: శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) తిరుపతిలో నర్సింగ్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతుంది. టిటిడి ఆధ్వర్యంలోని టెర్టియరీ కేర్ మెడికల్ సెంటర్.. అప్రెంటిస్ ట్రైనింగ్ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్లో దరఖాస్తులను ఈ నెల 31లోపు పంపించాల్సి ఉంది. దరఖాస్తు ఫీజు ఒసిలకు రూ.590గా ఉంది. ఎస్‌సి/ ఎస్‌టి/ ఒబిసి/ ఇడబ్ల్యుఎస్/ దివ్యాంగులకు రూ.354.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
పరీక్ష కేంద్రం: ఎస్‌బిఐఎంఎస్- శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ , తిరుపతి.
ఆగస్టు 18వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు.
ఆగస్టు 20వ తేదీన ఇంటర్వ్యూ ఉంటుంది.
ఎంపికైన వారికి నెలకు స్టైఫెండ్ రూ.21,500 అందుతుంది.
బిఎస్‌సి నర్సింగ్/ బిఎస్‌సి (హానర్స్) నర్సింగ్ / పోస్ట్ బేసిక్ బిఎస్‌సి నర్సింగ్ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. నర్సింగ్ డిగ్రీ 2021 తరువాత పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. హిందూ మతానికి చెందిన వారై ఉండాలి.
రాష్ట్ర నర్సింగ్ రిజిస్ట్రేషన్ కౌన్సిల్ ద్వారా నమోదు చేసుకొని ఉండాలి. అంతేకాక.. నాట్స్ పోర్టల్లో www.nats.education.gov.in నమోదు చేసుకోవాలి.
అప్లికేషన్ను ప్రింట్ తీసుకొని అవసరమైన ధ్రువపత్రాలతో ది రిజిస్ట్రేషన్, సిఎప్ ఎఆర్ బిల్లింగ్, ఎస్‌విఐఎంఎస్, అలిపిరి రోడ్, తిరుపతి చిరునామాకు పోస్టు ద్వారా గాని.. వ్యక్తిగతంగా గాని దరఖాస్తులు పంపించాలి.